గురువారం 28 మే 2020
Warangal-city - Apr 16, 2020 , 03:49:06

దాతల సహకారం మరువలేనిది..

దాతల సహకారం మరువలేనిది..

  • మంత్రి ఎర్రబెల్లికి రూ. లక్ష విరాళం అందజేసిన గీత, నవీన్‌ దంపతులు 

తొర్రూరు, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ కట్టడికి దాతల సహకారం మరువలేనిదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన వ్యాపారి చిదిరాల గీత, నవీన్‌ దంపతులు పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా నియంత్రణ కోసం రూ.లక్ష విళారాన్ని బుధవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకుల లోగోను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ రోజురోజుకూ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు మరింత అప్రతమత్తంగా ఉండాలన్నారు. కష్టకాలంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. నవీన్‌ లాంటి వాళ్లు రూ.లక్ష విరాళంతోపాటు పేదలకు నిత్యావసరాలు ఇచ్చేందుకు ముందుకు రావడాన్ని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, కొల్లూరి అశోక్‌ తదితరులు ఉన్నారు. 


logo