శనివారం 06 జూన్ 2020
Warangal-city - Apr 14, 2020 , 03:18:16

లాక్‌డౌన్‌లో పకడ్బందీగా పనిచేయాలి

లాక్‌డౌన్‌లో పకడ్బందీగా పనిచేయాలి

  • ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు

వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ విజృంభన దృష్ట్యా ఈ నెల 30 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో విద్యుత్‌ ఉద్యోగులందరూ పకడ్బందీగా పనిచేయాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు కోరారు. సంస్థ డైరెక్టర్లు వెంకటేశ్వర్‌రావు, గణపతి, నర్సింగరావు, సంధ్యారాణి, మోహన్‌రెడ్డితో పాటు సీజీఎం తిరుపతిరెడ్డి, జీఎం వెంకటరమణ, డీఈ టెక్నికల్‌ అనిల్‌కుమార్‌తో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. పెండింగ్‌ వర్క్‌ ఆర్డర్లను పూర్తిచేయాలని సీఎండీ సూచించారు. బిల్‌ స్టాప్‌ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను అవసరం ఉన్న చోటుకు మార్చాలన్నారు. వినియోగదారులు విద్యుత్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఆపరేషన్‌ ఉద్యోగులు విధిగా ట్రాన్స్‌ఫార్మర్ల హెడ్‌ ఫ్యూజులను మార్చాలని, రోలింగ్‌ స్టాక్‌ను పెంచుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే ఈ నెల విద్యుత్‌ బిల్లులను వినియోగదారుల సెల్‌ నంబర్లకు పంపామని, సమాచారం అందని వారు టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబర్లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.


logo