గురువారం 04 జూన్ 2020
Warangal-city - Apr 14, 2020 , 03:16:37

నో మూవ్‌మెంట్‌ జోన్‌లో వసతులు కల్పిస్తాం

నో మూవ్‌మెంట్‌ జోన్‌లో వసతులు కల్పిస్తాం

  • అర్బన్‌ కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు

హన్మకొండ నమస్తే తెలంగాణ : నో మూవ్‌మెంట్‌ జోన్‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, మందులు ఇతర వసతులు సమకూర్చుతామని, వీటి కోసం ఎవరూ కూడా కంటైన్మెంట్‌ పరిధి దాటి బయటకు వెళ్లవద్దని, వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు హెచ్చరించారు. సోమవారం పాత కలెక్టరేట్‌ ఎదుట అల్లీపుర వీధికి చెందిన ప్రైమ్‌ కాంటాక్ట్‌ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌తో కలిసి కలెక్టర్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి సన్నిహితుల నమూనాలను తీసి వెంటనే పరీక్షలకు పంపించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి, జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డాక్టర్‌ కృష్ణారావును ఆదేశించారు.  కాగా, వడ్డేపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం వరకు ఎవరూ వెళ్లకుండా కంచె ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


logo