గురువారం 04 జూన్ 2020
Warangal-city - Mar 29, 2020 , 01:57:32

నేటి నుంచి ఇంటి వద్దకే సరుకులు

నేటి నుంచి ఇంటి వద్దకే సరుకులు

  • డివిజన్ల వారీగా షాపుల కేటాయింపు
  • ఫోన్‌ ద్వారా బుక్‌ చేసుకోవాలని కమిషనర్‌ సూచన
  • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
  • జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి

వరంగల్‌, నమస్తే తెలంగాణ : ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల సరఫరా ప్రక్రియకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి షాపుల యజమానులు ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందిస్తారని కమిషనర్‌ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ మేరకు డివిజన్ల వారీగా నిత్యావసర సరుకులు సరఫరా చేసేలా షాపులను కేటాయించినట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రముఖ మాల్స్‌కు సరుకుల పంపిణీ బాధ్యతలను అప్పగించామని తెలిపారు. ప్రజలు షాపుల ఫోన్‌ నంబర్ల ద్వారా సరుకులు బుక్‌ చేసుకోవాలని సూచించారు. వరంగల్‌ ప్రాంతంలోని డివిజన్లకు ఐదు షాపులు, హన్మకొండ ప్రాంతంలోని డివిజన్లకు 6 షాపులను కేటాయించామని తెలిపారు.  ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. డివిజన్ల వారీగా కేటాయించిన షాపుల వివరాలను కమిషనర్‌ పమేలా సత్పతి ప్రకటించారు. షాపుల వివరాలు పైవిధంగా ఉన్నాయి.logo