గురువారం 04 జూన్ 2020
Warangal-city - Mar 29, 2020 , 01:51:21

గడప దాటని జనం

గడప దాటని జనం

కాలు బయటపెట్టని జనం.. ఇంటింటా స్వీయ నిర్బంధం.. మానవాళి మనుగడకు ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రజలంతా ఏకతాటిపై నిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకనుగుణంగా ఇల్లే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడికక్కడ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపుతున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే వారిని వైద్యుల సూచనలకనుగుణంగా వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవడంలేదు. అత్యవసర సమయాల్లో నిత్యావసర సరుకులకు కొందరు మాత్రమే బయటకు వస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు  మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బానోత్‌ శంకర్‌నాయక్‌, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని, అత్యవసర సమయాల్లో మాస్క్‌లు ధరించాలని కోరుతున్నారు.                                               

జనగామ, నమస్తేతెలంగాణ/పాలకుర్తిరూరల్‌/దేవరు ప్పుల/బచ్చన్నపేట/స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌/రఘునాథపల్లి: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలు ఐక్యంగా నిలిచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఏప్రిల్‌ 14 వరకు క ర్ఫ్యూ పాటించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో ఆ రో రోజూ శనివారం జనగామ పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ఒకవేళ తప్పనిసరి బయటకు రావాల్సి వస్తే ముఖాలకు మాస్క్‌లు, గుడ్డలు ధరించి వచ్చి, తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత శానిటైజర్‌, సబ్బుతో కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నారు. నిత్యావసర సరుకుల కోసం సూపర్‌మార్కెట్లు, కిరాణ షాపు లు, పాల కేంద్రాలు, కూరగాయల దుకాణాలకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణి జ్య సంస్థలు, ఇతర దుకాణాలను యజమానులు స్వచ్ఛందంగా మూసి ఉంచడంతో ప్రధాన రహదారులు సహా వీధులన్నీ నిర్మానుష్యంగా మారా యి. జనగామ ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు ప్రాంతాల్లో డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహ నదారులను ఆపి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కరోనా కట్టడికి ప్రజలు బయటకు రా వద్దని, స్వీయ నిర్భంధం సహా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రత్యేక అధికా రులు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయా వార్డుల్లో ఇల్లుల్లూ తిరుగుతూ అవగాహన కల్పించారు. 13వ వార్డు కౌన్సిలర్‌ మల్లిగారి కళావతి రాజు తోపుడు బండిలో ఇంటింటికీ వెళ్లి ఉచితంగా కూరగాయలు అందజేశారు. ముత్తిరెడ్డి సేవా సం స్థ సహా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు.

గ్రామాల్లో..

జిల్లాలోని అన్ని మండలాల్లో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వీయనిర్బంధం కొనసాగిస్తున్నారు. శనివారం సీఐ బానోతు రమేశ్‌, ఎస్సై గండ్రాతి సతీశ్‌ ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. దేవరుప్పుల మండలంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రతి రోజు ప్రజలకు చాటింపు ద్వారా తెలియజేస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో కొంతమంది యు వకులు బైక్‌లపై వెళ్తుండగా ఎస్సై రామారావు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బచ్చన్నపేట మండలంలోని నారాయణపూర్‌లో శనివారం వైస్‌ ఎంపీపీ కల్లూరి అనిల్‌రెడ్డి ప్రజలకు ఉచితంగా మాస్క్‌లు పంపిణీ చేశారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి అవగాహన కల్పించారు. రఘునాథపల్లిలోని గోదాముల్లో పనిచేసే కార్మికులకు కరోనా వైరస్‌ నివారణపై ఎస్సై కందుల అశోక్‌కుమార్‌ అవగాహన కల్పించారు.


logo