శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - Mar 29, 2020 , 01:50:21

పల్లెల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

పల్లెల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 28 : జనగామ జిల్లాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రజలంద రూ ఇళ్లకే పరిమితమయ్యారు. శనివారం స్వచ్ఛందంగా బంద్‌ పాటించడంతో రహదారులు, వీధు లు బోసిపోయి కనిపించాయి. జనగామ 13వ వార్డు కౌన్సిలర్‌ దంపతులు కళావతిరాజు తోపుడుబండిలో కూరగాయలు వేసుకొని ఆ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఉచితంగా అందజేశారు. రైల్వేస్టేషన్‌ సెంటర్‌లో కూరగాయల విక్రయాల సెంటర్ల వద్ద రద్దీ, ధరలను మున్సిపల్‌ చైర్మన్‌ పోకల జమున, కమిషనర్‌ రవీందర్‌యాదవ్‌, కౌన్సిలర్‌ హరిశ్చంద్రగుప్త, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, అర్బన్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ పరిశీలించారు. సామాజిక దూరం పా టించాలని వ్యాపారులు, వినియోగదారులకు సూ చించారు. ద్విచక్ర వాహనదారులకు పోలీసులు, పెట్రోలింగ్‌ వాహన సిబ్బంది కౌన్సెలింగ్‌ ఇచ్చా రు. పోలీసులు సైరన్‌ మోగిస్తూ ప్రజలను అలర్ట్‌ చేశారు. పిల్లలు ఇంటిపట్టునే ఉంటూ ఇండోర్‌ గేమ్స్‌ ఆడారు. జనగామ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, కూడళ్లు బోసిపోయాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మె ల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య లింగాలఘనపు రం, రఘునాథపల్లిలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కరోనా కట్టడికి సూచనలిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పల్లెలన్నీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారులకు ముళ్లకంచెలు, ట్రాక్టర్లు, ఇతర పరికరాలు అడ్డుగా పెట్టారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన, పోలీసుల సూచనలతో కొన్ని గ్రామాల్లో నిబంధనలు సడలించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఇతర సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరించారు. జనగామ జిల్లా కేంద్రంలో సాధిక్‌ ఫౌండేషన్‌, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖాన, ఆర్టీసీ డిపో, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద శనివారం రెండోరోజు భో జనం, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ సాధిక్‌ అలీ, ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ మల్లేశ్‌యాదవ్‌, దవాఖాన ఆర్‌ఎంవో డాక్టర్‌ సు గుణాకర్‌రాజుతో కలిసి అందించారు.logo