శనివారం 06 జూన్ 2020
Warangal-city - Mar 29, 2020 , 01:49:09

డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా

డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా

మహబూబాబాద్‌జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ప్రజల కదలికలపై పోలీసులు ని ఘా పెంచారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేప థ్యంలో ప్రజలెవరూ ఇష్టారాజ్యంగా రోడ్లపైకి రా కుండా డ్రోన్‌ కెమెరాల ద్వారా గుర్తించి కఠిన చ ర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కేం ద్రంలోని పలు వీధుల్లో ప్రజలు, వాహనదారుల కదలికలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి శనివారం డ్రోన్‌ కెమెరాలతో పరిశీలించారు. వివిధ ప్రాంతా ల్లో ఉన్న 100 సీసీ కెమెరాలను కంట్రోల్‌ రూ మ్‌కు అనుసంధానం చేశారు. కంట్రోల్‌ రూమ్‌లో ముగ్గురు సిబ్బంది ఉండి ఏ బజార్‌లో ఎక్కువ జన సంచారం ఉందో తెలుసుకొని సంబంధిత పో లీసులకు వాకీటాకీలో చెబుతూ ప్రజలను ఇళ్లలోకి పంపిస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు ఇప్పటి వరకు 120 మంది రాగా, అందరూ 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసు లు, రెవెన్యూ అధికారులు, అంగన్‌వాడీలు మూ డు షిఫ్టులుగా పని చేస్తున్నారు. ప్రజలు నిత్యావసరాలకు బయటకు వస్తుండగా, వాటిని డోర్‌ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు రెండు వాట్సప్‌ నంబర్లను అందుబాటులోకి తీసు కు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెసేజ్‌ చేస్తే అన్ని సరుకులూ ప్యాక్‌ చేసి డోర్‌ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌, తొర్రూరు బస్టాండ్‌, రెండు కూరగాయల మార్కెట్లలో కూరగాయలు విక్రయించా లని నిర్ణయించారు. ప్రజలు రోడ్ల మీదికి రాకుం డా నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. logo