బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 19, 2020 , 13:22:23

నేటి నుంచి టెన్త్‌ వార్షిక పరీక్షలు

నేటి నుంచి టెన్త్‌ వార్షిక పరీక్షలు

  • నేటి నుంచి టెన్త్‌ వార్షిక పరీక్షలు
  • 73 కేంద్రాలు.. 15980 మంది విద్యార్థులు
  • 30 సిట్టింగ్‌, ఐదు ఫ్లయింగ్‌ స్కాడ్స్‌
  • గంట ముందు కేంద్రాలకు చేరుకోవాలి
  • 9.35 వరకు ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతి
  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

సుబేదారి, మార్చి18 : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాగం ఏర్పాట్లు పూర్తి చేసింది.  గురువారం నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈ మేరకు  విద్యాశాఖ, పోలీసు, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్‌, వైద్యా ఆరోగ్య శాఖలు సంయుక్తంగా పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. పరీక్షలు ప్రారంభం నుంచి, పూర్తి అయ్యే వరకూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

73 పరీక్ష కేంద్రాలు ..

పదో తరగతి వార్షిక పరీక్షల కోసం 72 రెగ్యులర్‌ కేంద్రా లు, ప్రైవేట్‌ అభ్యర్థులకు ఒక సెంటర్‌, మొత్తం 73 కేంద్రా లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 373 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 15,980 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలికలు 7,273, బాలురు 8,484, ప్రైవేట్‌ అభ్యర్థులు 223 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 30 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, ఐదు ప్లాయింగ్‌ స్క్వాడ్స్‌, ప్రతి పరీక్ష కేంద్రం పర్యవేక్షణకోసం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్స్‌, వెయ్యి మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. విద్యార్థులు ఎండబారిన పడకుండా పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంపును ఏర్పాట్లు చేశారు. ఈ క్యాంపులో ఒక ఏఎన్‌ఎం, మందులు అందుబాటులో ఉంటాయి. తాగునీటి వసతి, 24 గంటలు కరంటు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.

గంటముందే సెంటర్‌కు చేరుకోవాలి..

 విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత హాల్‌ టికెట్‌ నంబర్‌తో రూం నంబర్‌ తెలుసుకోవాలి. ఆ తర్వాత పరీక్ష సమయం ప్రకారం పరీక్ష రాసే గదికి అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 9:30 నుంచి 12:15 గంటల వరకు జరుగుతుంది. 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. logo