ఆదివారం 24 మే 2020
Warangal-city - Mar 19, 2020 , 03:34:44

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

  • ఇంటిదారిపట్టిన విద్యార్థులు 
  • కిటకిటలాడిన బస్టాండ్లు
  • చివరి రోజు 779 మంది గైర్హాజర్‌
  • 56 కేంద్రాల్లో ఎగ్జామ్స్‌ నిర్వహణ

సుబేదారి, మార్చి 18 : ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి. ఈ నెల 4న ప్రారంభమైన ఎగ్జామ్స్‌ రెండు వారాల పాటు కొనసాగాయి. ఫస్టియర్‌, సెకం డియర్‌ విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా మొ త్తం 56 సెంటర్లు ఏర్పాటు చేశారు. ధర్మసాగర్‌ ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఒక్కరోజే 14 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. ఈ ఒక్క ఘటన తప్ప మిగతా చోట్ల పరీక్షలన్నీ ప్రశాం తంగా ముగిశాయి. కాగా, చివరి రోజు సెకండియర్‌ పరీ క్షకు 20,011 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉం డగా 19, 232 మంది హాజరైనట్లు డీఐఈవో ప్రశాంత తెలిపారు. మంగళవారం ఫస్టియర్‌, బుధవారంతో సె కండియర్‌ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటి దారి పట్టారు. సెంటర్ల నుంచి బయటకు వచ్చిన విద్యా ర్థులు ‘హమ్మయ్య పరీక్షలు అయిపోయాయ్‌' అంటూ కేరింతలు కొట్టారు. పరీక్ష కేంద్రాల నుంచి వచ్చిన వి ద్యార్థులు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకు న్నా రు. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వరంగల్‌ నగరం లో ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, ప్రైవేట్‌ కళాశాలల హాస్ట ళ్లలో ఉండి విద్యనభ్యసిస్తారు. ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో హాస్టళ్లను ఖాళీచేసి ఇంటిదారిపట్టారు. విద్యార్థులను తీసుకెళ్లడానికి వచ్చిన తల్ల్లిదండ్రులతో హన్మకొండ బస్‌స్టేషన్‌ కిటకిటలాడింది.


logo