మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Mar 17, 2020 , 03:51:36

ముందు జాగ్రత్తే మందు

ముందు జాగ్రత్తే మందు
  • ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాలి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌
  • జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌
  • పాల్గొన్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి

హన్మకొండ నమస్తే తెలంగాణ, మార్చి 16:  కరోనా వైరస్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నివారణ సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం సాయంత్రం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతాకుమా రి తదితరులతో  కలిసి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీ స్‌ శాఖ అధికారులు, ఆర్డీవోలతో హైదరాబాద్‌ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మా ట్లాడుతూ అసెంబ్లీలో సీఎం మాట్లాడిన విషయాలతో పాటు  జీవో నంబర్‌-4లో తెలిపిన అన్ని ఆదేశాలను కచ్చితంగా పా టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌-19పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలే తప్ప భయాందోళనలకు గురికావొద్దన్నారు. ముఖ్యంగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్ర త పాటించేలా చైతన్యం కల్పించాలన్నారు. పెద్ద సంఖ్యలో ప్ర జలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాలపై పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలపై ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని, యాజమాన్యాలు వారి సంస్థలను మూసి ఉంచారన్నారు. బో ర్డు పరీక్షలు రాసే విద్యార్థులు ఉండే హాస్టళ్లు మినహాయించి మిగతావన్నీ మూసి వేయాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందే విధంగా వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సభలు, సమావేశాలు, ఫం క్షన్లు, ఈవెంట్స్‌ అనుమతించొద్దని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాం తాకుమారి మాట్లాడుతూ అనుమానాస్పద కేసుల విషయం లో ట్రేస్‌ ఔట్‌ చేయడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడడంతోపాటు నివారణ చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

అవగాహన కల్పించేలా చర్యలు..

కరోనా వైరస్‌ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మం తు తెలిపారు. ఎంజీఎంలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశామని, అలాగే అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పా టు చేసి వ్యాధి వ్యాప్తి, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత ఉం డేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో బృందాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. అలాగే విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇండ్లలోనే ఐసోలేషన్‌లో ఉంచి అవసరమైన చర్యలు తీసుకునేలా శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో రాపిడ్‌ రెస్పాన్స్‌ టీం లను ఏర్పాటు చేశామని, పోలీస్‌, రెవెన్యూ, వైద్యారోగ్య శా ఖలు, ఇతర శాఖలతో కలిసి కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా ఐక్యంగా పనిచేస్తున్నట్లు సీపీ రవీందర్‌ తెలిపారు. సభలు, ఫంక్షన్‌ హాల్స్‌, సినిమా థియేటర్లన్నీ మూసివేయించామని,  వదంతులు, ఫేక్‌ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నా రు. గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో ముందుకు పోతున్నామని, ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ దయానంద్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్‌ మసూద్‌, డీఈవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. logo
>>>>>>