శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 17, 2020 , 03:44:26

ప్రగతి పరుగు!

ప్రగతి పరుగు!
  • రూ.498.61 కోట్లతో పట్టణ ప్రణాళికలు
  • డివిజన్‌ల వారీగా అభివృద్ధి పనులకు అంచనాలు
  • ప్రాధాన్యతాక్రమంలో చేపట్టేందుకు కార్యాచరణ
  • విలీన గ్రామాలపై అధికారుల ప్రత్యేక దృష్టి

వరంగల్‌, నమస్తే తెలంగాణ: చారిత్రక వరంగల్‌ నగరం ప్రగతి పరుగులు పెట్టనుంది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా క్షేత్ర స్థాయిలో గుర్తించిన పనులకు అధికారులు అంచనాలు  తయారు చేశారు. గ్రేటర్‌ కా ర్పొరేషన్‌ పరిధి 58 డివిజన్లలో గుర్తించిన అభివృద్ధి పనులకు రూ.498.61 కోట్లతో అంచనాలు తయారు చేశారు. పట్టణ ప్రగతిలో పొందుపర్చిన అంశాల వారీగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్ర ణాళికలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. వరంగల్‌ గ్రేటర్‌ జనాభా ప్రాతిపదికన ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి పట్టణ ప్ర గతి నిధులు రూ.14.68 కోట్లను కేటాయించింది. మంజూరైన నిధులతో మొద ట ప్రాధాన్యతాంశాలను గుర్తించి, అభివృద్ధి పనులను  చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. 

మొదటగా ప్రాధాన్యత పనులు..

పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నారు. ప్ర స్తుతం విడుదల చేసిన రూ. 14.68 కోట్ల ను వినియోగించుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ప ట్ణ ణ ప్రగతిలో ప్రాధాన్యతాంశాలుగా చేర్చిన శ్మశాన వాటికలు, కమ్యూనిటీహాళ్ల అభివృద్ధితో పాటు రహదారులపైనున్న గుంతలు పూడ్చడం, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, శిథిలావస్థలో ఉన్న స్తంభాల తొలగింపుపై అధికారులు దృష్టి సారించనున్నారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు ప్రహరీలు లేని శ్మశాన వాటికలను గుర్తించి వాటి చుట్టూ గోడలను నిర్మించే ప నులు చేపట్టనున్నా రు. దీం తో పాటు అత్యవసరం అనుకున్న పనులను మొదటి విడతలో వచ్చిన నిధులతో పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.  

డివిజన్ల వారీగా ప్రణాళికలు

పట్టణ ప్రగతి అభివృద్ధి ప్రణాళికలను డివిజన్ల వారీగా తయారు చేశారు. పది రోజుల పాటు డివిజన్లలో ప ర్యటించించిన అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించిన స మస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులకు అంచనాలు తయా రు చేశారు. అయితే డివిజన్లలో మైనర్‌, మేజర్‌ వర్క్‌లుగా గుర్తించి వేర్వేరుగా అంచనాలు రూ పొందించారు. తొలి విడత లో మైనర్‌ పనులను పూర్తి చేయాలని అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే గ్రేటర్‌ కార్పొరేషన్‌  ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉంది. వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్‌ పరిధిలో ఉన్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో 13 డివిజన్లు, పరకాల నియోజకవర్గ పరిధిలో నాలుగు, స్టేషన్‌ఘనఫూర్‌ నియోజకవర్గ పరిధిలో ఒక డివిజన్‌  గ్రేటర్‌లో ఉన్నాయి. అయితే పట్ణణ ప్రగతి నిధులను అధిక మొత్తంలో విలీన గ్రామాల అభివృద్ధికి కేటాయించాల ని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో అ ధికారులు ఆ దిశగా ముందుకెళ్లనున్నారు.  


logo