ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Mar 16, 2020 , 03:23:57

కిటకిటలాడిన ఐనవోలు

కిటకిటలాడిన ఐనవోలు
  • భారీగా తరలివచ్చిన భక్తజనం
  • మల్లన్నను దర్శించుకొని మొక్కుల చెల్లింపు

ఐనవోలు, మార్చి 15: ఐలోని కిటకిటలాడింది. వారాంతపు జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి శనివారం రాత్రే ఆలయానికి చేరుకొని విడిది చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం క్యూ కట్టారు. స్వామి వారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు అనంతరం దర్శనం ప్రారంభమైంది. ఆలయ అర్చకుడు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పట్నాలు వేసి బోనం వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు ఒడిబియ్యం, వస్ర్తాలు, ముత్తయిదు  సామగ్రిని ముట్టజెప్పారు. మరికొందరు రథ సేవను నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఈవో నాగేశ్వర్‌రావు, చైర్మ న్‌ మునిగాల సంపత్‌కుమార్‌, కమిటీ సభ్యు లు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

అన్నదానం 

దేవస్థానం ఆవరణలో శాలివాహన చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకులు అన్నదానం చేశారు. ట్రస్టు నిర్వాహకులు అమరవాది సారంగపాణి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో రాజారపు రాజ్‌కుమార్‌, అమరవాది రాజు, నాగరాజు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  logo