శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 08, 2020 , 02:28:03

‘అమ్మ’ సేవకు గుర్తింపు

‘అమ్మ’ సేవకు గుర్తింపు

అర్బన్‌ కలెక్టరేట్‌, మార్చి 07: ‘అమ్మ’ సేవకు గుర్తింపు లభించింది. మల్లికాంబ మ నోవికాస కేంద్రాన్ని స్థాపించి తన పిల్లలతో పా టు సుమారు 250 మంది మానసిక వికలాంగులకు అమ్మగా మారి సపర్యలు చేస్తుండడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందించే అవార్డుకు కేం ద్రం నిర్వాహకురాలు బండా రామలీల ఎంపికైంది. నేడు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించే వేడుకల సందర్భంగా  ఆమె అవార్డు అందుకోనున్నారు. హన్మకొండకు చెందిన బండా రామలీల, డాక్టర్‌ హరినాథ్‌ దంపతులకు కూతురు, ఇ ద్దరు కుమారులు. కాగా కుమాలిద్దరూ పుట్టుకతోనే మానసిక వికలాంగులు. వారి సంరక్షణకు రామలీల ఎంతో కష్టపడ్డారు. గుంటూ రు, రాజమండ్రి తదిత ర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సంస్థల్లో చేర్పించారు. ఈ క్రమంలో పి ల్లలను చూసేందుకు ఓ సారి రాజమండ్రికి వెళ్లి న సందర్భంగా తన కు మారులను తామే సా ధారణ అబ్బాయిల్లా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష రామలీలలో వచ్చింది. అందుకు ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన వ చ్చింది. దీంతో రామలీల మొదట మానసిక వికలాంగులకు సంబంధించి డిప్లొమా కోర్సు లో శిక్షణ తీసుకోవడంతో పాటు బీఈడీ చదివారు. తమ లాగా మిగతా తల్లిదండ్రులు బా ధ పడొద్దనే ఉద్దేశంతోప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. 


2001లో అప్పటి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సహకారంతో హన్మకొండ సుబేదారి ప్రాంతం లో అద్దె భవనంలో తన తల్లి మల్లికాంబ పే రుతో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఇద్దరు మానసిక వికలాంగులు మొత్తం నలుగురితో కేంద్రం ప్రారంభమైంది. తొందర్లోనే అలాంటి వారి సంఖ్య పదులకు చేరింది. ఈ క్రమంలో బండా రామలీల చేస్తున్న సేవను గుర్తించిన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి 2004 హన్మకొండ హ యగ్రీవాచారి మైదానం వెనుకాల అంబేద్కర్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌ను కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే కేంద్రాన్ని నిర్వహిస్తున్న రామలీల ప్రస్తుతం 250 మందికి పైగా మానసిక వికలాంగ విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. వీరికి మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా విద్యతోపాటు ఉపాధి శిక్షణనిస్తున్నారు. అలాగే మానసికోల్లాసానికి తోడ్పాటునందించే క్రీడల్లో సైతం శిక్షణ ఇప్పిస్తున్నారు ప్రత్యేక అవసరాలున్న పిల్లలలకు సేవ లు చేస్తున్నందుకు బండా రామలీల ఇప్పటికే అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ మె సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ మ హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రభు త్వం రామలీలను అవార్డుకు ఎంపిక చేసింది. 


ప్రభుత్వం చేయూత.. దాతల సహకారం

మల్లికాంబ మనో వికాసం కేంద్రానికి జిల్లా యంత్రాంగం స్థలం కేటాయిస్తే, దాతల సహకారంతో కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర సం స్థలకు చెందిన వారు పండుగలు, వివిధ కార్యక్రమాల సందర్బంగా అన్నదానం చేయడం, నోట్‌బుక్స్‌, పండ్లు, తదితర సామగ్రి పంపిణీ చేస్తున్నారు.   ప్రతి సంవత్సరం సంస్థలో చేరే విద్యార్థుల సంఖ్యతో పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న రెస్క్యూ తదితర కారణాలతో దొరికిన అనాథ మానసిక వికలాంగులను సైతం  కేంద్రంలో చేర్పించుకొని వారి బాగోగులు చూసుకుంటున్నారు.  


విద్యతోపాటు ఇతర అంశాల్లో శిక్షణ

మానసిక వికలాంగులు విద్యతో పాటు ఇతర అంశాల్లో ముందుంటారని నిరూపించేలా నిర్వాహకులు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా పాఠాలు బోధించడమే కాకుండా సొంతంగా బతికేందుకు ఉపాధి శిక్షణ ఇస్త్తున్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ, వ్యక్తి అవసరాలకు సంబంధించిన శిక్షణ, మానసికోల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  


logo