ఆదివారం 24 మే 2020
Warangal-city - Mar 06, 2020 , 02:30:49

భారీ వర్షం

భారీ వర్షం


రెడ్డికాలనీ, మార్చి 05 : నగరంలో వర్షం కురిసింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో ప్రజలు తడిసిపోయారు. సుమారు రెండు గంటల పాటు పడిన వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. రాత్రి వరకు కురిసిన వర్షంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరగా బయటకు వెళ్లాల్సిన ప్రజలు తడవకుండా గొడుగులను వినియోగించారు. 


మంటలతో.. పరుగులు తీసిన జనం.. 

కాజీపేట : కాజీపేట పట్టణంలో ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారం, వర్షానికి రైల్వే స్టేడియంలో ఉన్న హోల్డింగ్‌కు కొన్ని అడ్వడైజ్‌మెంట్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నా రు. పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురగాలి, వర్షం బీభత్సానికి ఫ్లెక్సీ చినిగి ఎగిరి విద్యుత్‌ తీగలపై పడడంతో మంటలు చేలరేగాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు భయాభ్రాంతులకు గురై పరుగులు తీశారు. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.  


విద్యుత్‌ వైరుకు చెట్టుకొమ్మ తగిలి మంటలు.. 

నక్కలగుట్ట : హన్మకొండలో అకాల వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హంటర్‌ రోడ్డులోని డీఈవో కార్యాలయంలో ఎదుట ఉన్న  చెట్టు కొమ్మ  విద్యుత్‌ లైన్‌కు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు  వెంటనే విద్యుత్‌ సరాఫరా నిలిపి వేసి వైర్లకు మరమత్తులు చేపట్టారు. 


రోడ్లన్నీ జలమయం.. 

హన్మకొండలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పలు కాలనీల రోడ్లు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాల్వల్లో ప్రవహించే మురుగు రోడ్లపైకి వచ్చింది. దీంతో వాహనదాలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. భవానినగర్‌, శ్రీనివాస కాలనీ, హౌ జింగ్‌ బోర్డు కాలనీ రోడ్లన్నీ వర్షానికి జలమయం కావడం తో పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు, కార్యాలయాల నుచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు సైతం దాదాపు గంట సేపు వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుకున్నారు. రోడ్లపై నిలిచిన నీటిలో నుంచి వెళ్లలేక అవస్తలు పడ్డారు.

ధర్మసాగర్‌లో..

ధర్మసాగర్‌ :  మండలంలో గురువారం ఒక్కసారిగా సా యంత్ర వర్షం కురిసింది. గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడడంతో సాయంత్రం వాతావారణం చల్లబడింది. వర్షం పలువురి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. logo