బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 06, 2020 , 02:25:52

ఇంటర్‌ ‘ద్వితీయ’ పరీక్షలు షురూ

 ఇంటర్‌ ‘ద్వితీయ’ పరీక్షలు షురూ

సుబేదారి, మార్చి 05 : ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం సెకండ్‌ ఇయర్‌ పరీక్షకు జనరల్‌ కోర్సుల నుంచి  మొత్తం 19,302 మంది విద్యార్థులకు 18,665 మంది హాజరయ్యారు. 637 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్‌ నుంచి 903 మంది విద్యార్థులకు గానూ 858 మంది విద్యార్థులు హాజరుకాగా, 45 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షలను జిల్లా అధికారులు ఎప్పటికప్పడూ పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ అధికారి, డీఐఈవో ప్రశాంత నగరంలోని పలు కేంద్రాలను తనిఖీ చేశారు. 


logo
>>>>>>