శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 05, 2020 , 02:32:20

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

సుబేదారి, మార్చి 04 : జిల్లాలో ఇంటర్‌ మీడియెట్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతగా ప్రారంభమయ్యా యి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాగం. మొదటిరోజున ఏ ఒక్క పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు తలెత్తలేదు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పరీక్షల నిర్వహణ కన్వినర్‌, జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి ప్రశాంత ఎప్పటికప్పుడూ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. తొలి రోజున ఇంటర్‌ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షకు మొత్తం జనరల్‌ కోర్సుల నుంచి 21,336మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండ గా 20,475మంది హాజరయ్యారు. వొకేషనల్‌ కోర్సులనుంచి 1,166 మంది విద్యార్థులకు 1,036 మంది హాజరయ్యారు. జనరల్‌, వొకేషనల్‌ కోర్సుల నుంచి 991 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో ప్రశాంత తెలిపారు. మొదటి రోజు విద్యార్థులు తల్లిందడ్రులతో కలిసి  పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. పోలీసులు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు. విద్యార్థుల హాల్‌టికెట్లను పరిశీలించి పరీక్ష కేంద్రం లోపలికి పంపించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ విధించారు. 


logo