శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 02, 2020 , 02:45:55

నలుగురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌

నలుగురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్‌

రెడ్డికాలనీ, మార్చి 01: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ శనివారం పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలానికి చెందిన బొచ్చు భానుచందర్‌, జయశంకర్‌ జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన గైకోటి శ్రీనివాస్‌, ఏటూరునాగారం మం డలం రామన్నగూడెంకు చెందిన గద్దల శ్రీకాం త్‌, జయశంకర్‌ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరికి చెందిన చల్లగురుగుల శంకర్‌లపై పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ జారీ చేసిన ఉత్తర్వులను ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న నిందితులకు జైలర్‌ సమక్షంలో పీడీ నిర్బంధ ఉత్తర్వులను అందజేశారు. నిందితులు విశాఖపట్నంలో గంజాయిని తక్కువ ధర కు కొనుగోలు చేసి తెలంగాణ, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో భాగంగా గంజాయిని రహస్యంగా తరలించేందుకు నిందితులు ముందుగా అద్దెకు రెండు కార్లు తీసుకుని విశాఖ జిల్లాలో  పలుమార్లు గంజాయిని కొనుగోలు చేసి ఎవరికీ అనుమమానం రాకుండా ఉండేవిధంగా నిందితులు కొనుగోలు చేసిన మొత్తం గంజాయిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్‌ చేసి కారులో రహస్యంగా రాజమండ్రి, భద్రాచలం, కొత్తగూడ, ఏటూరునాగారం, ములుగు మీదుగా తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలించేవారు. నిందితులు  కొన్ని నెలలుగా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా ఆత్మకూరు పోలీసులు గత ఏడాది డిసెంబర్‌ 15న అరెస్టు చేసి జైలుకు తరలించారు.  పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలు  నియంత్రించడంతో పాటు, నేర రహిత పోలీస్‌ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడంపై సీపీ ప్రత్యేక దృష్టిసారించారు.  చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్‌ సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందని  సీపీ హెచ్చరించారుlogo