శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 29, 2020 , 02:49:25

పట్టణ ప్రగతి పనులను పూర్తి చేయాలి

పట్టణ ప్రగతి పనులను పూర్తి చేయాలి

వరంగల్‌ సబ్‌అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించిన విద్యుత్‌ సమస్యలను యుద్ధ్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఆదేశించారు. శుక్రవారం విద్యుత్‌ భవన్‌ నుంచి కంపెనీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, గణపతి నర్సింగరావు, సంధ్యారాణి, మోహన్‌ రెడ్డితో కలిసి వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల విద్యుత్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ పట్టణ ప్రగతి పనుల పురోగతి ఏ రోజుకారోజు అప్‌డేట్‌ చేయాలన్నారు. వీధి దీపాల మీటర్లను కూడా మార్చాలన్నారు. మన పట్టణాలను మనమే బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పుట్‌పాత్‌పై ఉన్న ట్రాన్స్‌ఫారంలను మార్చాలని వాటి చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీజీఎంలు కిషన్‌, అశోక్‌కుమార్‌, తిరుపతిరెడ్డి, మోహన్‌రావు, తిరుమలరావు తదితరులుపాల్గొన్నారు. 


logo