బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 29, 2020 , 02:43:19

కిట్స్‌లో ఘనంగా ‘సంస్కృతి’

కిట్స్‌లో ఘనంగా ‘సంస్కృతి’

భీమారం, ఫిబ్రవరి 28: ప్రపంచంలోనే భారతీయ సంస్కృ తి గొప్పదని ప్రముఖ కవి, సినీ రచయిత, వాగ్గేయకారుడు గోర టి వెంకన్న అన్నారు. భీమారం కిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో శు క్రవారం ‘సంస్కృతి-20’ కార్యక్రమాన్ని గోరటి వెంకన్న జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బా ధ్యత విద్యార్థులపై ఉందన్నారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలు అవలంభిస్తున్నాయని తెలిపారు. మేధావులు, విద్యావంతులు ప్రశ్నించడం అలవర్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ పా లనలో తెలంగాణ రాష్ట్రం హింసకు తావులేకుండా ప్రశాంతం గా, సుభక్షంగా ఉందన్నారు. ఊరు భాషయే భాషకు పునాధి అని, పల్లె పాటకు భూమిక అవుతుందన్నారు. పని-పాట సం స్కృతి గొప్పదన్నారు. బుద్ధుడి బోధనలు అనుసరణీయమని, మహాత్మగాంధీ, రమణ మహర్షి, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. 


అహింస, శాంతియు త జీవనం ప్రజలకు అవసరమని వేయి ఏళ్ల కిందనే మార్గ నిర్ధేశనం చేశారన్నారు. పంచభూతాలను కాపాడుకోవాలని, విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. నేటి సాంకేతిక యుగంలో సెల్‌ఫోన్స్‌, ఇంటర్‌నెట్‌లాంటి సామాజిక మధ్యమాలకు బానిసకాకుండా మానవీయ విలువలను కాపాడవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. నిరంతరం చదువుతో పోటీ పడే విద్యార్థులు మానోసికోల్లాస కార్యక్రమాలతో ఒత్తిడి జయించవచ్చున్నారు. విద్యార్థులు సమాజం కోసం పనిచేయాలని సూచించారు. కిట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అశోక్‌రెడ్డి, ఆకారపు హరీశ్‌, కిట్స్‌ సంస్కృతి-20 చైర్మన్‌ ప్రొఫెసర్‌ రఘోత్తమరెడ్డి, సంస్కృతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌ నర్సింహరావు, ప్రభాకరాచారి, విద్యార్థి నాయకులు నితిన్‌భార్గవ్‌, సజన్‌కుమార్‌, రుత్విక్‌రెడ్డి, వేణుగోపాల్‌, గోపి పాల్గొన్నారు.


అలరించిన ఆట, పాట 

కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారంరాత్రి ప్రముఖ సినీ గాయకుడు ఎల్‌వీ రేవంత్‌, ప్రత్యూషలు తమ ఆట పాటలతో ఉర్రూతలూగించారు. రేవంత్‌ ఆలపించిన అల.. వైకుంఠపురం, లెజెండ్‌ చిత్రాల్లోని పాటలు విద్యార్థుల్లో జోష్‌ నింపాయి. సిం గర్‌ ప్రత్యూష ఆలపించిన సామజవరగమనా.. సాంగ్‌కు విద్యార్థులు కేరింతలు కొట్టారు. 


logo
>>>>>>