సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Feb 28, 2020 , 02:50:11

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

నర్సంపేట,నమస్తేతెలంగాణ : ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని  కలెక్టర్‌ హరిత అన్నారు. గురువారం నర్సంపేట పట్టణంలోని 3, 23, 24 వార్డుల్లోని ఎస్సీ కాలనీలను ఆమె  పరిశీలించారు. పొద్దం తా వీధుల్లో తిరుగుతూ అధికారులకు సూచనలు, సలహాలను అందించారు. వార్డుల్లో చేయాల్సిన అభివృద్ధి పనులను కమిటీలే గు ర్తించాలన్నారు. వాటిని ఆయా ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని సూచించారు.  ఆయా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు.  పన్ను ల ద్వారానే మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభు త్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తుందన్నారు.  పెంచిన ఇంటిపన్నులు, నల్లా పనులు నామమాత్రమేనని తెలిపారు. ప్రజలు వాటిని బాధ్యతతో చెల్లించాలని కోరారు. రెండు పడకల ఇళ్లను నిర్మిం చి,  అర్హులైన అందరికీ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. స్థానికంగా పట్టణంలో నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఇల్లులేని వారికి కేటాయిస్తామన్నారు.  వచ్చిన వారి కి, పక్కగ్రామాల వారికి ఇవ్వమన్నారు. పట్టణంలో  వెయ్యి ఇళ్లు నిర్మించడానికి  అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తయిందన్నారు.  పట్టణంలో లీకేజీలకు వెంటనే మరమ్మతు చేయాలన్నారు. పిచ్చి మొక్కలు పెరిగిన ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు అందించాలన్నారు. వల్లభ్‌నగర్‌ ఎస్సీ కాలనీలో ప్రభు త్వ స్థలంలో పార్క్‌ నిర్మించాలని సూచించారు. చుట్టూ మొక్కలను నాటాలన్నారు. కుమ్మరికుంట రాజీవ్‌నగర్‌లోని సర్కార్‌ బావి నీరు కలుషితమవుతున్నాయన్నారు. కాలనీల్లోకి మురుగునీరు రాకుండా కాల్వను నిర్మించాలని సూచించారు. ఈ ప్రతిపాదనలను కూడా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. మార్కెట్‌ నిధులతో రోడ్లు నిర్మించారని, రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, మిషన్‌భగీరథ ట్యాంక్‌ ఎత్తులో నిర్మించడం వల్ల కొన్ని ప్రాంతాలకు సరిగా నీరు రావడం లేదని మహిళలు కలెక్టర్‌కు తెలిపారు. కాగా, కలెక్టర్‌ ఎస్సీ కాలనీలను కలియ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజనీకిషన్‌, డీఆర్‌వో హరిసింగ్‌, కమిషనర్‌ విధ్యాదర్‌, ఏడీఏ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు కవిత, బానాల ఇందిర, దార్ల రమాదేవి పాల్గొన్నారు.


logo