ఆదివారం 24 మే 2020
Warangal-city - Feb 28, 2020 , 02:45:09

చలివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర, జెడ్పీ చైర్‌పర్సన్‌

చలివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర, జెడ్పీ చైర్‌పర్సన్‌

చలివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర, జెడ్పీ చైర్‌పర్సన్‌


శాయంపేట, ఫిబ్రవరి 27 : శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టును, పంపుహౌస్‌ను గురువారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సందర్శించారు. చలివాగు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని పరిశీలించారు. నీళ్లు లేకపోవడంతో రైతులు గండ్ర దంపతులకు మొర పెట్టుకున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడం పట్ల స్పందించిన ఎమ్మెల్యే రమణారెడ్డి వెంటనె సంబంధిత దేవాదుల, ఇరిగేషన్‌ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎగువ నుంచి చలివాగులోకి నీళ్లు రాకుండా ఇక్కడి నుంచి పంపింగ్‌ చేస్తుండటంతో వెంటనే మోటార్లను ఆపివేయాలని ఆదేశించారు. మోటార్లను బంద్‌ చేయించి ప్రాజెక్టులో కనీస నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులో నీటి మట్టం ఉండేంత వరకు మోటార్లతో పంపింగ్‌ చేయవద్దని స్పష్టం చేశారు.   కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ అబ్బు ప్రకాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, వైస్‌ చైర్మన్‌ దూదిపాల తిరుపతిరెడ్డి  తదితరులు న్నారు. 


గంగిరేణిగూడెంలో పూజలు  

శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో గండ్ర దంపతులు గురువారంప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో భూలక్ష్మి, పెద్దమ్మతల్లి, పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గండ్ర దంపతులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. అలాగే నేరేడుపల్లి గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను, వాటర్‌ట్యాంకర్‌ను నడిపించి ఎమ్మెల్యే దంపతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుతోట రాజేశ్‌, కార్యదర్శి రాజు, నాయకులు పాల్గొన్నారు. పెద్దకోడెపాకలో ఇటీవల మరణించిన రేణుకుంట్ల మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. 


logo