మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 27, 2020 , 02:50:10

అభివృద్ధికి పెద్దపీట వేస్తాం

అభివృద్ధికి పెద్దపీట వేస్తాం

నర్సంపేట, నమస్తే తెలంగాణ : అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో బుధవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అన్నారు.  సీఎం కేసీఆర్‌తోనే పట్టణాల అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే  పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నర్సంపేట పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించామని ఆయన వివరించారు.  నర్సంపేటను మోడల్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే నర్సంపేట పట్టణం ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని వివరించారు. నాలుగేళ్లుగా రాజకీయాలు పక్కన పెట్టాలని, ఏ ఎన్నికలు లేవని అన్నారు. అందరూ అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని కోరారు. వార్డుల వారీగా ఏఏ సమస్యలు ఉన్నాయో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటిని నమోదు చేసి పరిష్కారం కోసం ప్రయత్నించాలని కోరారు. నర్సంపేటలో వార్డులలో సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు.  అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామని అన్నారు. ఈ నిధులతో ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేశామని తెలిపారు.  పట్టణ ప్రగతిలో నర్సంపేటను తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా మొదటి స్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని కోరారు. స్థానికంగా ఉన్న కాలనీలలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారాకి ఆయన హామీ ఇచ్చారు. నర్సంపేటలో ప్రతి 500 గృహాలకు ఒక చెత్తను తరలించే ట్రాక్టర్‌ ఉందన్నారు.వీటిలోనే తడిపొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటిరజినీ కిషన్‌, కమిషనర్‌ విద్యాధర్‌, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌ గోల్యానాయక్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>