సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 26, 2020 , 03:11:05

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 25 : ప్రజల ఆ రోగ్యాల పరిరక్షణ కోసం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ఎం హరిత సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెం డో రోజు కలెక్టర్‌ హరిత, జేసీ మహేందర్‌రెడ్డితో కలిసి వర్ధన్నపేట మున్సిపాలిటీలోని రెండు, మూడో వార్డులను సం దర్శించారు. ఈ సందర్భంగా రెండు వార్డుల్లో ఉన్న డ్రైనేజీలను ఆమె పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర ధానంగా మూడో వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అద్వాన్నంగా ఉండడంతో పాటుగా ఖాళీ ప్రదేశాలు, మోరీల వద్ద చెత్త  పేరుకుపోయి ఉండడంతో కలెక్టర్‌ అధికారులను మందలించి వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. కాలనీలోని ప్రజలు ఇంకుడు గుంతలు నిర్మించుకోకుండా వాడుకునే నీటిని ఇష్టానుసారంగా రోడ్లమీదకు వదలడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తొలుతగా బ స్టాండ్‌ను, రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన పారిశుధ్యాన్ని పరిశీలించి వెంటనే శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై నడుచుకుంటూ వస్తూ చికెన్‌ సెంటర్ల నుంచి వ్యర్థాలు, మురుగునీరు బయటకు వస్తుండడంతో దానిని చూసిన కలెక్టర్‌ ఆగ్రహించి దుకాణదారులను పిలిపించి హెచ్చరించారు. నీరు ఇలాగే బయటకు వచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకోవల్సి వస్తుందని ఆమె దుకాణదారులను మందలించారు. పట్టణంలో ఆక్రమణకు గురైన నాళాలను కూడా ఆమె పరిశీలించి పునరుద్ధరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. పదిరోజుల పాటు ప్రభుత్వం చేపట్టను న్న పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్‌ సూచించారు. 

స్థలం ఆక్రమణపై సీరియస్‌ .. 

మండల కేంద్రానికి చెందిన శ్మశానవాటిక స్థలాన్ని కొంతమంది రైతులు ఆక్రమించుకోవడంపై కలెక్టర్‌ హరిత సీరియస్‌ అ య్యారు. రహదారి పక్కన సంగెం వాగువ ద్ద ఉన్న శ్మశానవాటికను ఆమె సందర్శించి స్థలం హద్దులను పరిశీలించారు. శ్మశానవాటికకు సంబంధించిన భూమి సాగులో ఉండడంతో పంట పూర్తికాగానే భూమిని స్వాధీనం చేసునేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌లకు కలెక్టర్‌ సూచించారు. భూమికి సంబంధించిన మ్యాప్‌ను  తెప్పించుకొని పరిశీలించి వెంటనే భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ ప్రహరీని నిర్మించాలని ఆదేశించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం స్థలాన్ని హరిత పరిశీలించిన శుభ్రం చేయాలని అధికారులను చెప్పారు. పట్టణానికి సమీపంగా నిర్మించనున్న డంపింగ్‌యార్డు స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌జీ, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆంగోతు అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జీ రవీందర్‌, కౌన్సిలర్‌ తుమ్మల రవీందర్‌, కొండేటి అనీత, మంచాల రామకృష్ణ, తోటకూరి రాజమణి, ప్రజలు పాల్గొన్నారు. 


logo