ఆదివారం 24 మే 2020
Warangal-city - Feb 26, 2020 , 03:10:17

మలుపులు తిరుగుతున్న శిశువు విక్రయ ఘటన

మలుపులు తిరుగుతున్న శిశువు విక్రయ ఘటన

నెక్కొండ, ఫిబ్రవరి 25 : నెక్కొండలో ఆడ శిశువు విక్ర య ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. పరిశీలనలు, విచారణలు, వాంగ్మూలాల నమోదు, వాయిదాల పరంపరతో వివాదం సాగుతూనే ఉంది. ఆడశిశువు విక్రయ కేం ద్రంగా తలెత్తిన వివాదం మంగళవారం చివరకు పార్థు న ర్సింగ్‌హోమ్‌ సీజ్‌కు దారితీసింది. జిల్లా బాలల సంరక్షణ యంత్రాంగం, ఐసీడీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖ, బాలల రక్షణ కమిటీ.. ఇలా పలువురు రంగంలోకి దిగినా శిశువు ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. కలెక్టర్‌ హరిత సమగ్ర ద ర్యాప్తునకు ఆదేశిస్తూ జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్యను వి చారణ అధికారిగా నియమించగా క్రిమినల్‌ చర్యల దిశ గా అధికార యంత్రాంగం అడుగులేస్తోంది. ఈ నేపథ్యం లో డీఎంఅండ్‌హెచ్‌వో మధుసూధన్‌ తన యంత్రాంగంతో నెక్కొండకు మంగళవారం చేరుకొని శిశువు విక్రయం జరిగిన ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌, వార్డులు, ఓపీ రూ ములన్నింటినీ పరిశీలించి, రికార్డు చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కొమురయ్య, తహసీల్దార్‌ డీఎస్‌ వెంకన్న, ఎస్సై నాగరాజు సమక్షంలో ఆస్పత్రి ని సీజ్‌ చేశారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కొమురయ్య విచారణకు వచ్చి ఈ నెల 17న ఆస్పత్రిని క్లోజ్‌ చేయగా  మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌వో ఆస్పత్రికి తాళం వేసి సాక్షుల సమక్షంలో సీజ్‌ చేయడం గమనార్హం. అనంతరం డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ మండలంలోని బొల్లికొండ శివారు మాలోత్‌ నంద్యాతండాకు చెందిన సుశీల-ప్రశాంత్‌ దంపతుల శిశువు  విక్రయం జరిగినట్లు తమకు సమాచాచం అందగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోతో విచారణ చేయించామన్నారు. పార్థు నర్సింగ్‌హోమ్‌లో శిశువు విక్రయం జరిగినట్లు తేలడంతోపాటు ఆస్పత్రిలో క్వాలీఫైడ్‌ డాక్టర్లు లేకపోవడం, ఆస్పత్రికి కనీసం అనుమతి లేదని తే లిందన్నారు. ఈ పరిస్థితుల్లో మండల ప్రజలు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ప్రభుత్వ ని బంధనలమేరకు ఆస్పత్రికి సీలు వేసినట్లు చెప్పారు. శిశువు జాడ మాత్రం తెలియదన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికా రి సమగ్ర విచారణలోనే శిశువు ఆచూకి తదితర అంశాలు వెలుగులోకి రావచ్చన్నారు. మండల కేంద్రంలోని మరికొన్ని ఆస్పత్రులు నిబంధనల మేరకు నడువడంలేదని త మ దృష్టికి వచ్చినందున డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోతో విచారణ జరిపిస్తామన్నారు. ఆస్పత్రి డీఎంఅండ్‌హెచ్‌వో సీజ్‌ చేయగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కొమురయ్య, నెక్కొండ పీహెచ్‌సీ వైద్యాధికారి రమేశ్‌, మాస్‌ మీడియా అధికారి స్వరూపరాణి, డీటీ రాజ్‌కుమార్‌, ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, నెక్కొండ సర్పంచ్‌ యమున రంజిత్‌రెడ్డి, పంచాయతీ కో ఆప్షన్‌ సభ్యుడు గటిక మల్లయ్య, మాజీ సొసైటీ చైర్మన్‌ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.

కొనసాగిన ప్రైవేట్‌ ఆస్పత్రుల తనిఖీలు..

డీఎంఅండ్‌హెచ్‌వో ఆదేశాలమేరకు నెక్కొండలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను డిప్యూడీ డీఎంఅండ్‌హెచ్‌వో కొమురయ్య మంగళవారం తనిఖీ చేశారు. పలు ఆస్పత్రుల్లో నిర్వహణ లోపాలను గుర్తించి వైద్యులకు సరిచేసుకోవాలని సూచించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రాథమిక చికిత్సలు మాత్రమే చేయాలని ఆదేశించామన్నారు. ల్యాబ్‌లు నిర్వహించే వారు విధిగా అనుమతి పత్రాలను పొందాలని, సరై న ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందన్నారు. క్వాలిఫైడ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ మాత్రమే అనుమతి పొంది ల్యాబ్‌లను నిర్వహించాలన్నారు. 


logo