ఆదివారం 24 మే 2020
Warangal-city - Feb 25, 2020 , 03:17:59

కొనసాగుతున్న నాణేల లెక్కింపు

కొనసాగుతున్న నాణేల లెక్కింపు

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 24: మేడారం వనదేవతలకు భక్తులు చెల్లించుకున్న కానుకల్లో నోట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ నాణేల లెక్కింపు ఇంకా లెక్కతేలలేదు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మూడు రోజుల నుంచి ఒడిబియ్యం నుంచి వలంటీర్లు నాణేలను వేరు చేస్తున్నారు. సోమవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. భక్తులు చెల్లించిన మొక్కుల్లో కాగితాలు, సంచులు, వ్యర్థాలను వేరుచేసి నాణేలను కడిగి ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వచేస్తున్నారు. నాణేల విలువ ఆధారంగా వేరుచేసి తూకం వేసి కిలోకు ఎన్ని వస్తున్నాయని పరిశీలించి లెక్కిస్తామని ఆలయ ఈవో టీ రాజేంద్రం వెల్లడించారు. మంగళవారం నాణేలతో పాటు విదేశీ కరెన్సీ, వెండి, బంగారు ఆభరణాలను లెక్కిస్తామని అన్నారు. మంగళవారం వీలైనంత ఎక్కువమంది వలంటీర్లతో లెక్కింపు ప్రక్రియ ముగించడానికి ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.


logo