శనివారం 28 మార్చి 2020
Warangal-city - Feb 24, 2020 , 03:35:06

పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి

భీమారం, న్యూశాయంపేట: ముఖ్యమంత్రి సహాయ ని ధి నిరుపేదలకు వరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమే శ్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధి 55, 57, 58వ డివిజన్లలోని నిరుపేదలకు సీఎం సహాయనిధి నుంచి మంజూ రైన రూ.1.15 లక్షల చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే రమేశ్‌ మాట్లాడుతూ పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కా ర్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, బానోత్‌ కల్పన, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రె డ్డి, కూడా సలహా మండలి సభ్యుడు నన్నెబోయిన రమేశ్‌యాదవ్‌, నాయకులు జక్కు రమేశ్‌, నాగరాజు, శంకర్‌, రవీందర్‌గుప్త, సతీశ్‌, కార్తీక్‌, చేరాలు పాల్గొన్నారు.

 

పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి..

న్యూశాయంపేట: పల్లెప్రగతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీ సుకొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. ఆదివారం హంటర్‌ రోడ్డులోని క్యాంప్‌ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై సమీ క్షా సమావేవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజల భాగస్వామ్యంతో కలిసి ముం దు కు వెళ్లాలని అన్నా రు. డివిజన్లలో పారిశుధ్యం, పచ్చదనం పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కా ర్యక్రమం లో కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.


logo