మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 23, 2020 , 03:19:52

ముదిరాజ్‌లకు అండగా సీఎం కేసీఆర్‌

ముదిరాజ్‌లకు అండగా  సీఎం కేసీఆర్‌
  • రూ.90 కోట్ల నిధులతో చేప పిల్లలు
  • 65వేల మందికి ద్విచక్రవాహనాలు

సుబేదారి, ఫిబ్రవరి 22: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్‌ కులస్తులకు సీఎం కేసీఆర్‌ వెన్నుదన్నుగా నిలిచారని వైద్య,ఆర్యోగ శాఖమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ముదిరాజ్‌ ఎంప్లాయిస్‌ , ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (మెపా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జెడ్పీ హాల్‌లో నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి  హాజరయ్యారు. సదయ్య అధ్యక్షతన నిర్వహించిన  సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో ముదిరాజ్‌లు వృత్తిపరంగా, విద్య, ఆర్థిక, సామాజికంగా వెనుకాబాటులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ముదిరాజ్‌ల బాధలు తెలుసుకున్నారు, ఆర్థిక పరిపుష్టితోపాటుగా, సామాజికంగా ఎదగడానికి ముదిరాజ్‌లకు అవకాశాలు కల్పించారన్నారు. వృత్తిపరమైన చేపలపై ఆధారపడి జీవించే మన సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్‌ ఏటా బడ్జెట్‌ నిధులు కేటాయించారు, ఈ ఏడాది రూ.90 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని అన్నారు. 65 వేల మంది మత్స్య కార్మికులకు ఎక్సెల్‌ వాహనాలు ఇచ్చాం. ముదిరాజ్‌ భవనాలకు రూ.10 లక్షలు ఇచ్చామని చెప్పారు. 


అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ముదిరాజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ బీసీల పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి 245 గురుకులాలు ప్రవేశపెట్టిన చరిత్ర దేశంలో సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. అంతేకాకుండా చట్టసభల్లో ముదిరాజ్‌ ప్రాతినిథ్యం ఉండాలని సీఎం కేసీఆర్‌ వరంగల్‌కు చెందిన బండాప్రకాశ్‌కు రాజ్యసభ పదవిని కట్టబెట్టారని మంత్రి గుర్తు చేశారు. ముదిరాజ్‌లు వృత్తిపరంగా బలపడుతూ మోడ్రన్‌గా రాణిస్తూ ఆర్థికాభివృద్ధి ్దచెందుతూ, ఉన్నత విద్యలో రాణించాలని, సామాజికంగా మరింత చైతన్యం కావాలని సూచించారు.  రాజ్యసభసభ్యుడు ఎంపీ బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ  రాష్ట్రం లో ముదిరాజ్‌ల సంఖ్య అధికంగా ఉన్నందున సీఎం కేసీఆర్‌ ఆర్థిక ఎదుగుదల కోసం కోట్లాది నిధులు మనకు కేటాయిస్తున్నారు. హైదరాబాద్‌ కోకాపేటలో కోట్లాది రూపాయల విలువ చేసే 5 ఎకరాల భూమిని సీఎం కేసీఆర్‌ కేటాయిం చి, భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. సమావేశంలో ప్రొఫెసర్‌ దినేష్‌కుమార్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు కొత్తగట్టు శ్రీనివాస్‌, కార్యనిర్వహక సభ్యులు లోకలబోయిన కృష్ణ, పులి దే వేందర్‌, మహేందర్‌, వేణు మాధవ్‌, కట్ల శ్రీనివాస్‌, మొగిలి, శాగ నర్సయ్య, కార్పొరేటర్లు బయ్య స్వా మి, కేశబోయిన అరుణ, ఇండ్ల నాగేశ్వర్‌రావు, సాదు రాజేష్‌, పులి రజనీకాంత్‌, పల్లెబోయిన అశోక్‌, పులి ప్రభాకర్‌, బండి సారంగపాణి, మల్ల్లేశం, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.


logo
>>>>>>