శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 22, 2020 , 02:57:11

ఓం నమ శివాయ

ఓం నమ శివాయ

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 21: సర్వం శివమయం జగత్‌ అని చెప్పడానికే ‘ఆట కదరా శివా’ రాశానని ప్రముఖ సినీ న టుడు, ఆధ్యాత్మికవేత్త తణికెళ్ల భరణి అన్నారు. శుక్రవారం మ హా శివరాత్రిని పురస్కరించుకుని ఇండస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యం లో బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన ‘ఆట గదరా శివ’ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. శివుడి కోసం కఠోరమైన దీక్షలు చేయాల్సిన అవసరంలేదన్నారు. పరమ శివుడు భక్త సులభుడని, కోరిన కోరికలు ఈ డేర్చే కొండంత దేవుడు శివుడన్నారు. భారతీయ సంస్కృతిలో ఏ వేడుకైనా శరీరానికి, మనసుకీ బలాన్ని చేకూర్చేదేనని బోధించారు. హడావిడి ఎక్కువైన కొద్ది భక్తి లుప్తమైపోతుందని ప్రవచించారు. ఉపవాసం మంచిదని ఆధుని క శాస్ర్తాలు కూడా చెబుతున్నాయన్నారు. మహాశివరాత్రి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ.. ఆ రోజు చేసే ఉపవాసం ఎన్నో రుగ్మతలను తొలగించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుందన్నారు. అనంతరం ఆయన స్వయంగా రచించి స్వరపర్చిన ‘ఆట గదరా శివా.. ఆటగద కేశవా’ ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపించి భక్తులకు ఆధ్యాత్మి కానందాన్ని కలిగించారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మా ట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు. పాశ్చాత్య సంస్కృతి మాయలో పడి హిందూ సంస్కృతీ సంప్రదాయాలను విడనాడే ప్రతి వారూ హిం దూ ద్రోహులేనని వ్యాఖ్యానించారు. దేవాలయాలకు వెళ్లే సమయం లోనైనా.. సంప్రదాయ దుస్తులను ధరించాలని కోరా రు. ప్రస్తుతం దేశంలో మాతమార్పిడులు ఎక్కువశాతం జరుగుతున్నాయన్నారు. 


మతమార్పిడిలను అరిక ట్టేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలన్నారు. వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రా వు మాట్లాడుతూ నగరంలోని ఆలయాల్లోగానే హయగ్రీవాచారి మైదానం సైతం శివ నామస్మరణతో మార్మోగుతుందన్నారు. కార్యక్రమ ప్రారంభంలో రచయిత, కవి భాస్కరరావు మాట్లాడుతూ.. భారతీయులు కులం, మతం వంటి వర్గ వైష మ్యాలతో ఒకరికొకరు దూరమవుతున్నారన్నారు. శివున్ని ఆరధించే వారందరూ.. శివకులమే అన్ని శివపురాణంలో శివుడు, పార్వతికి చెప్పిన మాటలను ప్రస్తావించారు. శివుడు అసలైన లౌకికవాదని, అందర్నీ సమానంగా చూస్తాడన్నారు. ప్రపంచంలోని అన్ని పురాతన సంస్కృతులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, కేవలం భారతీయ సంస్కృతే ఇప్పటికీ సజీవంగా ఉందని కొనియాడారు. ఇండస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ఫౌండేషన్‌ ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అనంతరం మ హాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్ధరాత్రి 12గంటలకు లింగోద్భవ సమయంలో శివునికి సప్త హారతి ఇచ్చారు. హారతి అనంతరం 365 చిరు మట్టి లింగాలతో పేర్చిన శివ లింగానికి అభిషే కం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ హాజరై తనికెళ్ల భరణిని సన్మానించారు.


logo