సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 22, 2020 , 02:52:55

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మడికొండ, ఫిబ్రవరి21: మడికొండ మెట్టుగుట్టపై ఉన్న శ్రీమెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున 3గంటల నుంచే శ్రీస్వయంభూలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి మే లుకొలుపు, సుప్రభాత సేవ, తదితర పూజాది కా ర్యక్రమాలు చేపట్టారు. రాత్రి 8 గంటలకు శివ కల్యాణ మండపంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండుగ గా జరిగింది. స్వామివారి క ల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అదేవిధంగా జాగరణ చేసే భక్తుల కోసం సంస్కార భారతి ఆధ్వర్యంలో పేరిణి శివతాండవం, కూచిపూడి, భరత నాట్యం, సంగీత కచేరి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అర్ధరాత్రి దాటాక అగ్నిగుండాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం  కిక్కిరిసిపోయింది. శ్రీమెట్టురామలింగేశ్వరసేవా సమితి ఆధ్వర్యంలో ఓం నమఃశివాయ ఏకనామ జపం చేపట్టారు. ఇందులో పా ల్గొన్న వారికి జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. జాతర పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కాజీపేట ఏసీపీ రవీందర్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 


స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

శ్రీస్వయంభూలింగేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌-కవిత కుటుంబ సభ్యులు, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు దంపతులు, నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ దంపతులు, రూరల్‌ జిల్లా ఆర్డీవో మహేందర్‌జీ దంపతులు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారికి పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్‌ అల్లం శ్రీనివాసరావు, ఈవో రాజేందర్‌రావు, కాజీపేట, ఐనవో లు, దామెర తసీల్దార్లు బండి నాగేశ్వర్‌రావు, మంజుల, రజిని, కార్పొరేటర్లు తొట్ల రాజుయాదవ్‌, జోరిక రమేశ్‌, లింగం మౌనికాచరణ్‌రెడ్డి, జక్కుల రమారవీందర్‌, అర్చకులు రాగిచేడు అభిలాషశర్మ, సత్యనారాయణశర్మ, ధర్మకర్తలు ఆకుల శ్రీనివాసులు, అరూరి తిరుపతి, బొడ్ల శ్యాంసుందర్‌, పల్లపు రాజ్‌కుమార్‌, బైరి మేనక, మొట్ల నర్సింగరావు, ఉచిత ఐలుమల్లయ్య, పెద్ది ప్రభాకర్‌, భక్తులు చిగురుపాటి వెంకటేశ్వర్లు, గాండ్ల భిక్షపతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.logo