గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 22, 2020 , 01:55:50

పందుల స్వైరవిహారంపై అసంతృప్తి

 పందుల స్వైరవిహారంపై అసంతృప్తి

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 21: వీధుల్లో గుంపులుగుంపులుగా పందులు తిరగడంపై కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అసంతృప్తి వ్యక్తం చేశారు. పందుల కోసం పెంపకందారులు షెడ్లు నిర్మించుకోవాలన్నారు. లేకపోతే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని అధికారులకు సూచించారు. గురువారం రాత్రి పల్లెనిద్రలో భాగంగా ములుకనూరులో బస చేసిన కలెక్టర్‌ వేకువజామునే నిద్ర లేచి గ్రామంలోని వీధుల్లో కలియతిరిగారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కలకు టీగార్డులు ఏర్పాటు చేయడంపై ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. బతుకమ్మ బండ వద్ద వైకుంఠధామం నిర్మాణాన్ని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లెప్రగతి నిరంతర ప్రక్రియ అని, గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్‌ మాడుగుల కొంరయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్‌, అప్పని పద్మ, ఉపసర్పంచ్‌ సుద్దాల రఘు, తసీల్దార్‌ పోలం ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్‌, అధికారులు సంతో ష్‌, మౌనిక, కుమారస్వామి, శ్రీధ ర్‌, దేవానంద్‌, రాజమల్లారెడ్డి, కృ ష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు  రమేశ్‌, దార్న శ్రీనివాస్‌, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo
>>>>>>