గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 21, 2020 , 03:59:44

శివపూజకు వేళాయె..

శివపూజకు వేళాయె..

ఓం నమఃశివాయ.. హరహరమహాదేవ శంభోశంకరా.. అని భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శివాలయాలు ముస్తాబయ్యాయి. పార్వతీపరమేశ్వరుడి కల్యాణ వేడుకలు శుక్రవారం సాయంత్రం జరుగనున్నాయి.

ఓం నమఃశివాయ.. హరహరమహాదేవ శంభోశంకరా.. అని భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శివాలయాలు ముస్తాబయ్యాయి. పార్వతీపరమేశ్వరుడి కల్యాణ వేడుకలు శుక్రవారం సాయంత్రం జరుగనున్నాయి. కోరిన కోర్కెలు నెరవేర్చాలని భక్తులు మహేశ్వరుడికి పూజలు చేయడంతోపాటు నేడు జాగరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని శివాలయాల్లో భక్తుల కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయం, మడికొండలోని రామలింగేశ్వరాలయం, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వరాలయం, జయశంకర్‌ జిల్లాలోని కాళేశ్వరం, మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రుడి ఆలయం, జనగామ జిల్లాలోని పాలకుర్తి, కొడ్వటూరులోని శివాలయాలు విద్యుత్‌దీపాలతో అలంకరించడంతో కనువిందు చేస్తున్నాయి.                                                             -నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌


logo
>>>>>>