మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 21, 2020 , 03:52:09

డీసీసీబీ పాలకవర్గ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

డీసీసీబీ పాలకవర్గ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఎలక్షన్‌ అథారిటీ నోటిఫికేషన్‌ జారీచేసింది. 22వ తేదీన డీసీసీబీ పాలకవర్గం ఎన్నికకు నోటీస్‌ జారీ చేయనున్నారు.

  • 22న నోటిఫికేషన్‌ జారీ చేయనున్న అధికారులు
  • ఓడీసీఎంఎస్‌కు సైతం..
  • 25న నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ
  • 28న పోలింగ్‌, అనంతరం ఓట్ల లెక్కింపు

సుబేదారి, ఫిబ్రవరి 20: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఎలక్షన్‌ అథారిటీ నోటిఫికేషన్‌ జారీచేసింది. 22వ తేదీన డీసీసీబీ పాలకవర్గం ఎన్నికకు నోటీస్‌ జారీ చేయనున్నారు. 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3 గంటల వ రకు స్క్రూటిరీ, సాయంత్రం 3:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ, 28వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదేరోజు కౌంటింగ్‌, సాయంత్రం ఫలితాలు వెల్లడి, 29న ఆఫీస్‌బేరర్స్‌ ఎన్నిక ఉంటుంది.  


ఓటర్లు వీరే..

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గం ఎన్నికలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 90 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, 22 వ్యవసాయేతర సం ఘాల  చైర్మన్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. పీఏసీఎస్‌ నుంచి 16 మందిని, 22 వ్యవయేతర సంఘాల చైర్మన్ల నుంచి నలుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. ఇందులో నుం చి ఒకరిని డీసీసీబీ చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. డీసీసీబీ పాలక వర్గ ఎన్నికలల అధికారిగా జనగామ జిల్లా సహకారశాఖ అధికారి నియామకమ య్యారు.


ఓడీసీఎంఎస్‌ ఎన్నిక 

డీసీసీబీ పాలకవర్గ ఎన్నికతోపాటుగా ఓరుగల్లు జిల్లా కోఆపరేటివ్‌ మార్కెట్‌ సొసైటీ ఎన్నికను 28వ తేదీన నిర్వహించాలని స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ నిర్ణయం తీ సుకుంది. ఈ ఎన్నికలో 90మంది ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయేతర సం ఘాల చైర్మన్లు ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరిలో ఒకరిని చైర్మన్‌, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు.


logo
>>>>>>