బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 20, 2020 , 02:59:03

సీఎం కేసీఆర్‌ పాలనలోనే గిరిజనులకు గుర్తింపు

సీఎం కేసీఆర్‌ పాలనలోనే గిరిజనులకు గుర్తింపు

పాలకుర్తి రూరల్‌, ఫిబ్రవరి 19 : రాష్ట్రప్రభుత్వం సీఎం కేసీఆర్‌ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని టీఎస్‌కే తండాలో బుధవారం శ్రీ సంత్‌ సేవాలాల్‌ 28వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు గిరిజనులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి నృత్యం చేశారు. అనంతరం సర్పంచ్‌ ధరావత్‌ బాలునాయక్‌ అధ్యక్షతన సేవాలాల్‌ జయంతిని  నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంజారాలు ప్రకృతి బిడ్డలన్నారు. సంస్కృతి సంప్రదాయాలను గిరిజనులు మరువొద్దని సూచించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవన్నారు. నీతి నియమాలకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. గిరిజనుల ఆరాధ్య ధైవం సేవాలాల్‌ మహరాజ్‌ అని కొనియాడారు. సేవాలాల్‌ స్ఫూర్తితో గిరిజనులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 1077 తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలను గుర్తించామన్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. తండాల్లో సారాను నిషేధించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపుతానన్నారు.


 మిషన్‌ భగీరథ ద్వారా తండాల్లో కూడా ఇంటింటికి సురక్షితమైన మంచీనీరు అందించామన్నారు. టీఎస్‌కే తండాకు రూ. కోటితో బీటీ రోడ్డు సౌకర్యం కల్పించానన్నారు. సేవాలాల్‌ గుడికి నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేసిన నృత్యాన్ని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య రమేశ్‌, ఏసీపీ గొల్ల రమేశ్‌, ఆర్డీవో రమేశ్‌, పూజారి ప్రేమ్‌సింగ్‌ మారాజు, రామ్‌కోటి నాయక్‌, రాష్ట్ర జీసీసీ చైర్మన్‌ మోహన్‌గాంధీనాయక్‌, తహసీల్థార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, సీఐ బానోత్‌ రమేశ్‌నాయక్‌, డాక్టర్‌ రవిరాథోడ్‌, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, ధరావత్‌ జ్యోతి, జినుగు అనిమిరెడ్డి, ఈదూరు రాజేశ్వరి ఐలయ్య, శ్రీరాం జ్యోతిర్మయి, కేలోత్‌ సత్తమ్మ, రంగు కుమార్‌, పుస్కూరి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జాటోత్‌ నెహ్రూనాయక్‌, భూక్య దల్జీత్‌కౌర్‌, ఎర్రబెల్లి రాఘవరావు, బొబ్బల అశోక్‌రెడ్డి, అడ్డూరి మాధవరావు, బానోత్‌ వెంకన్న, నర్సింహానాయక్‌, గుగులోత్‌ వాసునాయక్‌, దేవానాయక్‌, లకుపతినాయక్‌, మంగ్యానాయక్‌, నరేందర్‌పవార్‌, రాజేశ్‌నాయక్‌, జైసింగ్‌నాయక్‌, ఎంపీటీసీ మంద వీరలక్ష్మి, గిరిజనులు పాల్గొన్నారు.


logo