శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 18, 2020 , 02:50:26

ఆరో రోజు రూ.1.05 కోట్లు

ఆరో రోజు రూ.1.05 కోట్లు

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 13: హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జరుగుతున్న మేడారం హుండీ లెక్కింపు చివరి దశకు చేరుకుంది. మొత్తం 494 హుండీల్లో 419 హుండీలను లెక్కించారు. ఆరవ రోజైన సోమవారం జరిగిన హుండీల లెక్కింపులో రూ.1,05, 50,000 ఆదాయం వచ్చినట్లు మేడారం ఆలయ ఈవో తమ్మ రాజేంద్రం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి 78 హుండీలను లెక్కించామన్నారు. మంగళవారం జరిగే లెక్కింపులో మిగిలిన హుండీల లెక్కింపు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  తొలిరోజు 64 హుండీలు, గురువారం 65 హుండీలు, శుక్రవారం 65 హుండీలు, శనివారం 53హుండీలు, ఆదివారం 94 హుండీలు, సోమవారం 78 హుండీలను లెక్కించారు. ఇప్పటివరకు మొత్తం 419 హుండీలను లెక్కించగా రూ.9,81,87,000 ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు. 


logo