ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 17, 2020 , 04:26:13

డాగ్‌ షో అదుర్స్‌..

డాగ్‌ షో అదుర్స్‌..

నక్కలగుట్ట,ఫిబ్రవరి16: కాకతీయ కెన్నెల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండ సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన డాగ్‌ షో ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన శునకాలు పోటీలో పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేశాయి. సుమారు 28 రకాల దేశవిదేశీ జాతుల డాగ్స్‌  200 వరకు పోటీలో అలరించాయి.  ముఖ్య అతిథులుగా ఒబీడియన్‌ జడ్జ్‌ విలింగ్‌ హూ (మలేషియా), సీఎ మార్టీన్‌,(ఇండియన్‌) ఈపింగ్‌ హూ ( థైవాన్‌) హాజరయ్యారు. ఆల్‌ బ్రీడ్‌ చాంపియన్‌ షిప్‌ షోకు హాజరై గెలుపొందిన శునకాలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాకతీయ కెన్నెల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రమణారెడ్డి పాల్గొన్నారు.  logo