ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 17, 2020 , 04:22:43

‘సహకార’ గులాబీ..

‘సహకార’ గులాబీ..

ఐనవోలు, ఫిబ్రవరి 16: మండల పరిధిలోని నందనం కర్షక సేవా సహకార సంఘం చైర్మన్‌గా ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని రవీందర్‌రావు, వైస్‌ చైర్మన్‌గా పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి చందర్‌రావు  ఎన్నికయ్యారు.  సింగారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి చైర్మన్‌గా సింగారానికి  చెందిన దొపతి జయపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మునిగాల కుమారస్వామి  ప్రమాణస్వీకారం చేశారు.  


రైతుల శ్రేయస్సుకు కృషి చేస్తా: చైర్మన్‌ మార్నేని

 రైతుల శ్రేయస్సుకు కృషి చేస్తానని నందనం సొసైటీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు అన్నారు. సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నందనం సొసైటీకి పూర్వవైభవం తీసుకవస్తామన్నారు. సొసైటీ ఏకగ్రీవానికి  సహకరించిన నాయకులకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌,  రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ మజ్జిగ జయపాల్‌, జిల్లా కో-ఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌అలీ, జిల్లా నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.  


logo