గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 16, 2020 , 03:11:55

సెంట్రల్‌ జైలును సందర్శించిన ప్రాసిక్యూటింగ్‌ ఆఫీసర్స్‌ బృందం

సెంట్రల్‌ జైలును సందర్శించిన ప్రాసిక్యూటింగ్‌ ఆఫీసర్స్‌ బృందం

వరంగల్‌ క్రైం, ఫిబ్రవరి15 : డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం 14 మంది ప్రాసిక్యుటింగ్‌ ఆఫీసర్స్‌ బృందం వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శించింది. ఈ సందర్భంగా వారికి సెంట్రల్‌ జైలు చరిత్ర, జైళ్లశాఖ శాఖ విశిష్టతను జైలు సూపరింటెండెంట్‌ మురళీబాబు, డీడీ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సత్యనారాయణ వివరించారు. ఆయుర్వేద విలేజ్‌, మోడ్రన్‌ ములాఖత్‌, మై నేషన్‌ నర్సరీ, పెట్రోల్‌పంపును సందర్శించారు. కార్యక్రమంలో  పర్యవేక్షణాధికారి మురళిబాబు, ఉప పర్యవేక్షణాధికారి కాళిదాసు, భరత్‌, అమరావతి, జైలర్లు సక్రునాయక్‌, గోపిరెడ్డి, సాయిసురేశ్‌బాబు,  శ్రీనివాస్‌, ప్రేమ్‌కుమార్‌, డిప్యూటి జైలర్లు శ్రీనివాస్‌, రమేశ్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>