శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 15, 2020 , 02:17:23

ఆపదలో సర్కారు అండ

ఆపదలో సర్కారు అండ

వర్ధన్నపేట, ఫిబ్రవరి 14, నమస్తే తెలంగాణ : పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండల కేంద్రానికి చెందిన తిరుపతి నర్సయ్య అనారోగ్యంతో దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఆయనకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2లక్షలు మంజూరు కావడంతో ఇందుకు సంబంధించిన చెక్కును శుక్రవారం హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో వర్తించని వారికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రభుత్వం సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సహకారాన్ని అందించనున్నట్లు  తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ  మార్గం భిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మండల ఇన్‌చార్జి సుదర్శన్‌ పాల్గొన్నారు.

 సీఎం రిలీఫ్‌ పండ్‌ చెక్కు అందజేత..

పర్వతగిరి : పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇమ్మడి జైదీప్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్‌ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ఫండ్‌ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ప్రత్యేక చొరవతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.4లక్షల ఎల్‌వోసీని అందజేయడంతో బాధిత కుటుంబ సబ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌,  మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతపట్ల సోమేశ్వర్‌రావు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సర్వర్‌, ఉపసర్పంచ్‌ రంగు జనార్దన్‌, నాయకులు సందెల నవీన్‌ కుమార్‌, గోనె సంపత్‌, మట్ట కుమారస్వామి పాల్గొన్నారు.


logo