మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 15, 2020 , 02:16:40

నిట్‌లో కురా-2020 ప్రారంభం

నిట్‌లో కురా-2020 ప్రారంభం

నిట్‌ క్యాంపస్‌, ఫిబ్రవరి 14: వరంగల్‌ నిట్‌లో ఏటా జరిగే జాతీయస్థాయి మేనేజ్‌మెంట్‌ ఈవెంట్‌ కురా-2010 శుక్రవారం ప్రారంభమైంది. స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ) విభాగంలో ప్రారంభమైన ఈ సదస్సును ఫ్యాకల్టీ వెల్ఫేర్‌ డీన్‌ ప్రొఫెసర్‌ డీవీఎస్‌ఎస్‌ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. యువ మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు తమలోని ప్రతిభను వెలికితీసుకునేందుకు వేదికగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ వీ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. రెండు రోజుల ఈవెంట్‌లో నాయకత్వ లక్షణాలు, మిజ్‌ క్విజ్‌, ఏడీ ఎరీనా, ఆప్టిమైజర్‌, మీ-ప్లాన్‌, బిజ్‌వర్త్‌, వర్క్‌షాప్‌లు, కేస్‌ అనాలసిస్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి అంశాల్లో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో స్టూడెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జేవీ రమణమూర్తి, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్‌ ఫ్రాన్సిస్‌ సుధాకర్‌, స్టూడెంట్‌ కో ఆర్డినేటర్‌ వీ అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>