ప్రేమమ్, ఫిదా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకుంది సాయిపల్లవి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉందీ భామ. ఇపుడు సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ తాను కూడా ఎంటర్ టైన్ చేస్తానంటూ సినీ లవర్స్ ముందుకు రాబోతుంది. స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్ ‘స్టంట్ సిల్వ’ డైరెక్టర్ గా మారుతూ పూజాకన్నన్తో తొలి సినిమా చేయనున్నట్టు కోలీవుడ్ మీడియా వర్గాల టాక్. ‘స్టంట్ సిల్వ’ కీలక పాత్రలో కూడా కనిపించనున్నట్టు టాక్.
నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ సముద్రఖని లీడ్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. పూజాకన్నన్ ఐదేండ్ల క్రితం ఓ షార్ట్ ఫిలిమ్‌లో నటించింది. ఈ చిత్రానికి తలైవి ఫేం ఏఎల్ విజయ్ స్టోరీ, స్క్రీన్ ప్లే సమకూర్చబోతున్నాడట. అంతేకాదు ఏఎల్ విజయ్ టీంలో పూజాకన్నన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. సాయిపల్లవి-ఏఎల్ విజయ్ కాంబినేషన్ లో కణం చిత్రం కూడా వచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.