శనివారం 28 మార్చి 2020
Warangal-city - Feb 13, 2020 , 04:30:47

క్రీడాకారులకు ప్రోత్సాహం

క్రీడాకారులకు ప్రోత్సాహం
  • ప్రతిభను వెలికితీసేందుకు సర్కారు చేయూత
  • హన్మకొండలో సీఎం క్రికెట్‌కప్‌ పోటీలు ప్రారంభం
  • ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

వరంగల్‌స్పోర్ట్స్‌, ఫిబ్రవరి12: రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ధాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడామైదానం వేదికగా టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్‌ పోటీలను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది ప్రదాత అయిన సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఇలాంటి క్రీడాపోటీలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గతంలో క్రికెట్‌ కేవలం ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అంటూ సీమాంధ్రులకు మాత్రమే అవకాశాలు ఇచ్చేవారని వివరించారు. తన సోదరుడు, దివంగత ప్రణయ్‌భాస్కర్‌ క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులకు చక్కటి అవకాశాలు అందేలా చూశారని అన్నారు. 


అదే స్ఫూర్తితో త్వరలోనే జిల్లాలో అంతర్జాతీయస్థాయి టోర్నమెంట్‌కు వేదికగా ఉండేలా క్రికెట్‌ స్టేడియం నిర్మించేలా జిల్లా క్రికెట్‌ సంఘం సభ్యులతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని హామీఇచ్చారు. ఈపోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా క్రికెట్‌ సంఘం భాధ్యులు ఉదయ్‌భానురావు, టీఆర్‌ఎస్‌వీ విభాగం చాలా రోజుల నుంచి కృషిచేస్తున్నారని అన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈపోటీల్లో ఆయా డివిజన్‌ల నుంచి 32 జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పోటీల కన్వీనర్‌ ఉదయ్‌భానురావు వెల్లడించారు. అనంతరం జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ కార్యదర్శి, సీనియర్‌ క్రికెటర్‌ జయచందర్‌ను ఛీప్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బన్న ఐలయ్య, కార్పొరేటర్లు విజయ్‌భాస్కర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, డిన్న, వద్దిరాజు గణేష్‌, టీఆర్‌ఎస్‌వీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo