శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 13, 2020 , 04:23:44

మంత్రులకు పీఆర్‌ సమ్మేళన్‌ బాధ్యత

మంత్రులకు  పీఆర్‌ సమ్మేళన్‌ బాధ్యత
  • ఎర్రబెల్లికి జనగామ, జయశంకర్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు
  • ఈ నెల 25లోగా ఆయా జిల్లాల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనాల నిర్వహణ
  • సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి అనుగుణంగా ఆదేశాలు జారీ
  • సత్యవతిరాథోడ్‌కు వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలు

అర్బన్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 12: జిల్లా స్థాయిలో ‘పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌'  నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ప్రగతి భ వన్‌లో జరిగిన క లెక్టర్ల సమావేశం లో సీఎం కేసీఆర్‌ జిల్లాస్థాయిలో ‘పంచాయతీ రాజ్‌ సమ్మేళన్‌' ను నిర్వహించాలని సూచించిన విషయం విధిత మే. ఇందులో భాగం గా ఉమ్మ డి వరంగల్‌ జిల్లా బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌కు అప్పగించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాతో పాటు మహబూబాబాద్‌, ములుగు జిల్లాల బాధ్యతను మంత్రి సత్యవతిరాథోడ్‌కు, వరంగల్‌ రూరల్‌, జనగాం, భూపాలపల్లి జిల్లాల బాధ్యత మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావుకు అప్పగించారు.  వీరు ఈ నెల 25లోగా ‘పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌' నిర్వహించాల్సి ఉంటుంది.  logo