ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 11, 2020 , 03:17:21

పీఏసీఎస్‌ల్లో గులాబీ హవా..

పీఏసీఎస్‌ల్లో గులాబీ హవా..
  • నందనం, సింగారం సొసైటీలు టీఆర్‌ఎస్‌ కైవసం
  • పెగడపల్లిలో ఏడుగురు ఏకగ్రీవం
  • 156 డైరెక్టర్‌ స్థానాల్లో 74 ఏకగ్రీవం
  • మిగిలిన 82 స్థానాలకు 15న పోలింగ్‌
  • బరిలో 209 అభ్యర్థులు


భీమారం: పెగడపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో 13 డైరెక్టర్‌ స్థానాలకు 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా పలువురు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడంతో ఏడుగురు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఒకే నామినేషన్‌ రావడంతో శనివారం ముచ్చర్ల గ్రామానికి చెందిన 9వ డైరెక్టర్‌గా బండ సునీత, నాగారానికి చెందిన 11వ డైరెక్టర్‌ మానుపాటి సమ్మయ్య  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున 2వ డైరెక్టర్‌గా పోలిపాక దాస్‌, 6వ డైరెక్టర్‌గా పోలిపాక విమల, 9వ డైరెక్టర్‌గా బండ రాణి, 10వ డైరెక్టర్‌గా దామెర ఈశ్వరయ్య, 11వ డైరెక్టర్‌గా మానుపాటి సమ్మయ్య, 12వ డైరెక్టర్‌గా పోరెడ్డి రవీందర్‌రెడ్డి, 13వ డైరెక్టర్‌గా సూదుల కొముర రెడ్డి ఏకగ్రీవమయ్యారు. 1, 3,4,5,7,8 డైరెక్టర్లకు ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల నిర్వహణ అధికారి సారంగపాణి  తెలిపారు. ఐదుగురు డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ బలపరిచిన  అభ్యర్థులే కావడం విశేషం.

  

16 వార్డులు ఏకగ్రీవం 

హసన్‌పర్తి: మండల పరిధిలోని మూడు పీఏసీఎస్‌లతో పాటు హన్మకొండ పీఏసీఎస్‌ల్లో  నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నాలుగు పీఏసీఎస్‌లలో 39 వార్డులకు 16 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 23 వార్డులకు 69 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి రవీంద్ర తెలిపారు. మండలంలోని మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్‌లో 13 వార్డులకు 47 మంది నామినేషన్లు వేయగా 16 మంది ఉపసంహరించుకున్నారు. వీరిలో రెండు వార్డులు (4వ వార్డు జక్కు రమేశ్‌, 11వ వార్డు భూక్య వీరన్న) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన   11 వార్డుల్లో 31 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. అలాగే వంగపహాడ్‌ పీఏసీఎస్‌లో 13 వార్డులకు 34 మంది నామినేషన్లు వేయగా 13 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో 7 వార్డులు (2వ వార్డు మేరుగు రాజేశ్‌, 4వ వార్డు మేరుగు రేణుక, 6వ వార్డు పాశం జయపాల్‌రెడ్డి, 8వ వార్డు వరికోలు రవీందర్‌, 9వ వార్డు మేరబత్తి కల్యాణి, 12వ వార్డు బైరి జనార్దన్‌రెడ్డి, 13వ వార్డు బండి శారద) ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. మిగిలిన 6 వార్డులకు 14 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. హసన్‌పర్తి పీఏసీఎస్‌లో 13 వార్డులకు 50 మంది నామినేషన్లు వేయగా 21 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 


ఇక్కడ నాలుగు వార్డులు (5వ వార్డు చుంచు విజేందర్‌, 6వ వార్డు బిల్ల ఉదయ్‌కుమార్‌, 7వ వార్డు లంకదాసరి శోభ, 10వ వార్డు పాలకుర్తి రమేశ్‌) ఏకగ్రీవం కాగా మిగిలిన 9 వార్డులకు 21 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు. అలాగే హన్మకొండ పీఏసీఎస్‌లో 13 వార్డులకు  57 మంది నామినేషన్లు వేయగా 22 మంది ఉపసంహరించుకున్నారు. వీ రిలో మూడు వార్డులు (1వ వార్డు పులిశేరు సా రంగపాణి, 2వ వార్డు ఇట్యాల హరికృష్ణ, 6వ వార్డు బాషబోయిన భిక్షపతి) ఏకగ్రీవం కాగా మిగిలిన 10 వార్డులకు 32 మంది బరిలో ఉన్న ట్లు తెలిపారు. ఆయా పీఏసీఎస్‌లకు ఎన్నికల అధికారులు మాధవి, అబ్జల్‌పాషా, గోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో సీఏవోలు వెంకన్న, నాగభూషణం, రాజిరెడ్డి ఉపసంహరణ పక్రియను పూర్తి చేశారు. 


ధర్మసాగర్‌లో ఐదుగురు...

ధర్మసాగర్‌/వేలేరు: ధర్మసాగర్‌ పీఏసీఎస్‌ ఎన్నికల బరిలో 25 మంది ఉన్నారు. మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 5వ డైరెక్టర్‌ బేరే వీరయ్య, 8వ డైరెక్టర్‌ గున్‌డ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, 9వ డైరెక్టర్‌ మాచెర్ల కనుకరాజు, 10వ డైరెక్టర్‌  భిక్షపతి, 12వ డైరెక్టర్‌ శ్యామల రమేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ, 2వ  3వ, 4వ, 6వ, 7వ, 11, 13 వ డైరెక్లర్ల స్థానాల్లో 25మంది పోటీలో ఉన్నారు. సాయంత్రం ఎన్నికల అధికారి పద్మ పో టీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. 


12 స్థానాలకు 30 మంది బరిలో  

కరీమాబాద్‌: ఖిలావరంగల్‌ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని మొత్తం 13 మంది డైరెక్టర్‌ స్థానాలకు 47 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. అందులో 16 మంది నామినేషన్‌లు ఉపసంహరించుకోగా 12వ నియోజకవర్గంలో మాజీ చైర్మన్‌ కేడల జనార్దన్‌ ఏకగ్రీవమయ్యారు. దీంతో   12 స్థానాలకు గాను 30 మంది బరిలో నిలిచారని ఎన్నికల అధికారి భవాని     తెలిపారు. logo