బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 11, 2020 , 03:15:50

వనదేవతలకు మొక్కులు

వనదేవతలకు మొక్కులు
  • మేడారంలో భక్తజనం
  • జాతర ముగిసినా కొనసాగుతున్న పూజలు
  • తల్లుల దీవెనల కోసం తరలివస్తున్న భక్తులు

తాడ్వాయి, ఫిబ్రవరి 10: మేడారానికి భక్తుల రాక కొనసాగుతున్నది. ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో మహాజాతర శనివారంతో ముగియగా, భక్తులు మేడారం తరలివస్తూనే ఉన్నారు. తల్లులను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి జంపన్నవాగులో స్నానాలు చేశారు. జంపన్నగద్దె వద్ద మొక్కులు చెల్లించారు. తల్లుల గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. 


తల్లులకు యాటపోతులను, కోళ్లను బలిచ్చారు. పలు ప్రాంతాల్లో భక్తులు విడిది చేశారు. మహాజాతర ముగిసినా మేడారం పరిసరాల్లో జాతర కళ కనబడుతూనే ఉన్నది. వివిధ వ్యాపారాలు నిర్వహించిన వారు ఇప్పటికే తిరుగు ప్రయాణం కాగా, పలువురు చిరువ్యాపారులు ఇంకా జాతర పరిసరాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. జాతరలో కూలీలు, పారిశుధ్య కార్మికులు చెత్త, గద్దెల వద్ద బెల్లాన్ని తొలగిస్తున్నారు. అధికారులు జాతర పరిసరాల్లో తిరుగుతూ పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు.


logo