గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 11, 2020 , 03:11:32

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

ఖిలావరంగల్‌, ఫిబ్రవరి 10: వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. సోమవారం శంభునిపేట గిరిప్రసాద్‌నగర్‌ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్‌ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో అభివృద్ధి పనులకుగాను ఎంపీ నిధుల నుంచి రూ.50లక్షలు మంజూరు చేయించినందుకు వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిప్రసాద్‌నగర్‌తోపాటు నియోజకవర్గంలోని అన్ని స్లమ్‌ ఏరియాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. 70 ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామన్నారు. కార్యక్రమంలో వీ భాగ్య, అరుణ, రాజారాం, అయిలయ్య, సంతు, రాజు, పెంటయ్య, శ్రీలత, శమీమ్‌ తదితరులు పాల్గొన్నారు. 


సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

25వ డివిజన్‌కు చెందిన లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందింది. కాగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వచ్చిన రూ.48వేల చెక్కును ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ క్యాంపు కార్యాలయంలో బాధితురాలికి అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రిజ్వానాషమీమ్‌ మసూద్‌, పెంచాల కుమారస్వామి తదితరులు ఉన్నారు. 


ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ క్యాలెండర్‌ను వరంగల్‌ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ, జయరాం, శ్రీధర్‌, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. logo