సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 11, 2020 , 03:10:51

‘పల్లె ప్రగతి’ పనులను పూర్తి చేయాలి

‘పల్లె ప్రగతి’ పనులను పూర్తి చేయాలి
  • కలెక్టర్‌ ఆర్‌జీ హనుమంతు

ధర్మసాగర్‌, ఫిబ్రవరి 10 : పల్లె ప్రగతి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామంలో శ్మశానవాటిక, నర్సరీని ఆయన సోమవారం పరిశీలించారు. రెండో విడత పల్లె ప్రగతిలో చేపట్టిన నర్సరీ, శ్మశానవాటిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన అన్ని రకాల పనులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు  త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్‌కి సూచించారు. స్వచ్ఛ గ్రామాలకు అందరూ సహకరించాలని కోరారు. ఆయనవెంట సర్పంచ్‌ సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి సంపత్‌ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.


logo