శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 10, 2020 , 03:42:30

‘సహకార’ పోరు

‘సహకార’ పోరు

అర్బన్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 09: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ చివరి దశ కు చేరుకుంది. గురువారం ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసే చివరి రోజు వరకు జిల్లాలోని 12 సొసైటీల్లోని 156 డైరెక్టర్ల స్థానాలకు మొత్తం 616 నామినేషన్లు దా ఖలయ్యాయి. ఇందులో మొదటిరోజు 6వ తేదీ గురువారం 60, 7వ తేదీ శుక్ర వారం 162, 8వ తేదీ చివరి రోజైన శనివారం 394 నామినేషన్లు దాఖలయ్యా యి. కాగా ఆదివారం నామినేషన్ల స్క్రూటినీ చేపట్టారు. ఇం దులో 71 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించగా 545 నామినేషన్లు నిబంధనల మేరకు సక్ర మంగా ఉన్నట్లు సహకారశాఖ అధికారులు నిర్ధారించా రు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సింగారం సొసైటీలో 13 స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున 13 దాఖలు కాగా ఇందులో నుంచి ఒక్కటి తిరస్కరించగా 12 సక్రమంగా ఉన్నాయి. అలాగే ఖిలావరంగల్‌లో 47 నామినేషన్లు దాఖలు కాగా ఒక్కటి కూడా తిరస్కరి ంచబడలేదు. ధర్మసాగర్‌లో 65 నామినేషన్లు దాఖలు కాగా 10 తిరస్కరించగా 55 సక్రమంగా ఉన్నాయి. ఎ ల్కతుర్తిలో 67 నామినేషన్లు దాఖలు కాగా 13 తిరస్కరిం చగా 54 సక్రమంగా ఉన్నాయి. మల్లారెడ్డిపల్లిలో 49 నామినేషన్లు దాఖలు కాగా రెండు తిరస్కరించగా 47 సరిగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అదే విధంగా వంగపహాడ్‌లో 38 నామినేషన్లకుగాను 4 తిరస్కరించగా 34 సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. కాజీపేట దర్గాలో 53 నామినేషన్లకుగాను 4 తిరస్కరించగా 49 సక్రమం గా ఉన్నాయి. కమలాపూర్‌లో 81 నామినేషన్లు దాఖలు కాగా 8 తిరస్కరించగా 73 సక్రమంగా ఉన్నాయి. నందనంలో 49 నామినేషన్లకుగాను 9 తిరస్కరించగా 40 సక్రమంగా ఉన్నాయి. పెగడపల్లిలో 35 నామినేషన్లకుగాను 4 తిరస్కరించగా 31 సక్రమంగా ఉన్నాయి. అలాగే హసన్‌పర్తిలో 50 నామినేషన్లు దాఖ లు కాగా 4 తిరస్కరించగా 46 సరిగా ఉన్నాయి. హన్మకొండలో 69 నామినేషన్లకుగాను 12 తిరస్కరించగా 57 సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఒక్కొక్క నామినేషన్‌ దాఖలు అయిన స్థానాలు ఏకగ్రీ వం కానున్నాయి. నేడు నామినేషన్ల ఉపసంహరణ పూ ర్తయితే కానీ ఎన్ని ఏకగ్రీవం అవుతాయి, ఎన్నింటికి ఎ న్నికలు జరుగుతాయనేది స్పష్టత వస్తుందని సహకారశాఖ అధికారులు పేర్కొన్నారు. 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించి, 3 గంటల నుంచి లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫతాలను ప్రకటిస్తారు. చైర్మన్‌, వైస్‌ చైక్మన్‌ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. ఒక వేళ కోరం లేకపోతే మరు సటి రోజు చైర్మన్‌, వైస్‌ చైక్మన్‌లను ఎన్నుకుంటారని అధికారులు తెలిపారు. 


logo