గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 09, 2020 , 02:24:28

డీసీసీబీ పీఠం కైవసం చేసుకుందాం

డీసీసీబీ పీఠం కైవసం చేసుకుందాం

ఐనవోలు, ఫిబ్రవరి 08: డీసీసీబీ పీఠాన్ని సమష్టి కృషితో  కైవసం చేసుకుందామని వర్ధ్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమే శ్‌ అన్నారు. సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో శనివారం మండలంలోని నందనం సొసైటీలో 12వ వార్డు నుంచి మార్నేని రవీందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేశా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరూరి ర మేశ్‌ హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా విచ్చేసి మార్నేని రవీందర్‌రావు ఎమ్మెల్యేతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నందనం సొసైటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ను గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వా లు రైతులకు చేసిన పనులు బేరీజు వేసుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నందనం సొ సైటీపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమాని ఆశాభావం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పని చే సే నాయకులల్లో మార్నేని రవీందర్‌రావు మందు వరుసలో ఉంటారని ఎమ్మెల్యే ప్రశంసించారు. డీసీసీబీ పీఠం కైవసం చేసుకోవడం కోసం ఉమ్మడి జిల్లా  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కట్టుతున్నట్లు పేర్కొన్నారు. 


logo
>>>>>>