మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 08, 2020 , 03:53:48

జన సంద్రమైన అగ్రంపహడ్‌

జన సంద్రమైన అగ్రంపహడ్‌



ఆత్మకూరు, ఫిబ్రవరి 07 : అగ్రంపహాడ్‌లోని మినీమేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అశే ష భక్తజనం పోటెత్తింది. సమ్మక్క-సారలమ్మ త ల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం వరకు 35 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, రాష్ర్టా ల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. రెండు కిలోమీటర్ల క్యూలైన్‌లో భక్తు లు దర్శనం కోసం బారులుతీరారు. వన దేవతల కు ఎత్తు బంగారం, పసుపు, కుంకుమ, ఒడిబియ్యంతో మొక్కులు సమర్పించారు. సమ్మక్క-సారలమ్మకు భక్తులు ఎదురు కోళ్లు, గొర్రెలు, మేకలను బలిచ్చారు. కానుకలతో గద్దెలు నిండిపోయా యి.  క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. తల్లీ సల్లంగా సూడు ...మళ్లీ రెండేళ్లకోసారి వస్తాం అంటూ తి రుగు పయనమయ్యారు. ఎటువంటి అవాంఛనీ య ఘటనలు జరుగకుండా మమూనూరు ఏసీపీ శ్యాంసుందర్‌, సీఐ రంజిత్‌కుమార్‌ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సుధాకర్‌, జిల్లా అధ్యక్షుడు కామగాని కిరణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పల్లె మొ గిలి, కళాకారులు నీలం కుమార్‌, కామగాని సులోచన ఆలపించిన జానపద గీతాలు ఆకట్టుకున్నా యి.   ఆర్డీవోలు మహేందర్‌జీ, కిషన్‌, తహసీల్దా ర్లు ఎస్‌కే ముంతాజ్‌, జూలురి సుభాషిణి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీవో చేతన్‌రెడ్డి, ఎంపీపీ మార్క సుమలత రజనీకర్‌, ఆత్మకూరు జెడ్పీటీసీ కక్కెర్ల రాధికరాజు దామెర జెడ్పీటీసీ గరిగె కల్పన, కృష్ణమూర్తి దంపతులు, జాతర చైర్మన్‌ కత్తెరశాల మల్లే శం, డైరెక్టర్లు చెంచు ప్రభాకర్‌, జీ రా జన్న, మోరే మహేందర్‌, భాగ్య, ఎంపీటీసీ బీ భాగ్యరవి, అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు.   

నేడు వన ప్రవేశం..

గద్దెలపై కొలువైన సమ్మక్క -సారలమ్మ శనివారం వన ప్రవేశం చేయనున్నారు. పూజారులు సమ్మక్క-సారలమ్మ దేవతలను గద్దెలకు ఏవిధంగా చేర్చారో అదేవిధంగా   ప్రత్యేక పూజలు చేసి వీడ్కోలు పలుకనున్నారు.

 మొక్కులు చెల్లించిన కలెక్టర్‌ హరిత

అగ్రంపహాడ్‌లోని సమ్మక్క-సారలమ్మ దేవతలకు కలెక్టర్‌ హరిత శుక్రవారం సాయంత్రం మొక్కులను చెల్లించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, కొబ్బరి, బంగారం(బెల్లం)ను సమర్పించుకున్నారు. అనంతరం ఆర్డీవోలు కిషన్‌, మహేందర్‌జీ, తహసీల్దార్లతో జాతరలో వసతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసారి జాతరలో భక్తుల సౌకర్యార్థం అనేక వసతులను కల్పించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.


logo
>>>>>>