శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 07, 2020 , 03:43:17

తల్లుల సేవలో మంత్రులు

తల్లుల సేవలో మంత్రులు

మేడారం బృందం, నమస్తేతెలంగాణ: మేడారం మహా జాతరలో కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ తల్లులను గురువారం పలువురు రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మం త్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అమ్మవార్లను దర్శించుకొని ని లువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. గిరిజన సంప్రదా యం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర దేవాదా యశాఖ ద్వారా తల్లులకు అందించాల్సిన పట్టు వస్ర్తాలను మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వహస్తాలతో అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను మంచెపై నుంచి పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. అదే విధంగా మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఏసీబీ జడ్జి ముధుసూదన్‌రావు, భూపాలపల్లి జేసీ స్వర్ణలత, సింగరేణి ఈ ఎండీ శంకర్‌, సినీ హాస్యనటుడు ఫిష్‌ వెంకట్‌ తదితరులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. 


కేసీఆర్‌ కిట్‌ అందజేత

అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన మహారాష్ట్రలోని పూనేకు చెందిన శివానీ చౌహాన్‌ మేడారంలోని ప్రధాన వైద్యశాలలో పురుడు పోసుకొని బాబుకు జన్మనిచ్చింది.  విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శివానీకి కేసీఆర్‌ కిట్‌ను గు రువారం అందించారు. మేడారం పర్యటనలో భాగంగా ప్రధాన వైద్యశాలను తనిఖీ చేసిన మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ జాతరలో అన్ని శాఖలు సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడో పూనేలో నుంచి ప్రసవ సమయంలో సైతం త ల్లుల మీద భక్తితో మేడారం జాతరకు రావడం భక్తుల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. శి వానికి పుట్టిన బాబుకు జంపన్న అని నామకరణం చేసినట్లు తెలిపారు. అనంతరం జాతరలో వైద్య సేవలు అందించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అల్లం అప్పయ్య, రాష్ట్ర డైరెక్టర్‌ శ్రీనివాసరావుతో పాటు ఇతర వైద్యాధికారులకు మంత్రి ఈటల శాలువాలతో సత్కరించారు. అనంతరం ప్ర ధాన వైద్యశాల పక్కనున్న మీడియా సెంటర్‌ను సందర్శించా రు. సమాచారశాఖద్వారా అందిస్తున్న సేవల గురించి తెలుసుకొని ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం లో సమాచారశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డీఎస్‌ జగన్‌, ములుగు, మహబూబాబాద్‌ డీపీఆర్‌వోలు ఎంఏ గౌస్‌, మహ్మద్‌ అ యూబ్‌ అలీ, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పీఆర్‌వో కిరణ్మయి, సమాచారశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మొక్కులు

మేడారం సమ్మక్క-సారలమ్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ గురువారం పార్టీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించి ఎత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించారు. లక్ష్మణ్‌తోపాటు ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గుజ్జుల దేవేందర్‌రెడ్డి, కృష్ణవేణినాయక్‌ తదితరులు అమ్మవార్లను దర్శించుకున్నారు.


logo